విశాఖపట్నం జిల్లా జి.కె.వీధీ మండలం ఆర్.వి.నగర్ ఎ.పి.ఎఫ్.డి.సి.కార్యాలయం దగ్గర మావోయిస్టుల బ్యానర్లు కలకలం రేపాయి. గాలికొండ ఏరియా కమిటీ పేరిట కరపత్రాలు. బ్యానర్లు దర్శనం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులను తరిమి కొట్టమని గిరిజనులకు మావోయిస్టులు బ్యానర్ల ద్వారా పిలుపునిచ్చారు. కాఫీ తోటలు పై హక్కులు చట్ట ప్రకారం ఆదివాసిలు, పీడిత ప్రజలదేనని పేర్కోన్నారు. శ్రమ దోపిడీ చేస్తున్న ఏపీఎఫ్ డీసీ యాజమాన్యాన్ని మన్యం నుండి తన్ని తరిమి కొట్టాలని అన్నారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రోత్సహిస్తు ఆదివాసి జీవితాలను నాశనం చేయడానికి పూనుకున్న అధికార టీడీపీ, బిజెపి నాయకులకు హెచ్చరికలు జారీ చేసారు.