YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

తెలంగాణ రాష్ర్టానికి ద్రోహం చేసేందుకే కాంగ్రెస్ టీడీపీ పొత్తు - డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

తెలంగాణ రాష్ర్టానికి ద్రోహం చేసేందుకే కాంగ్రెస్ టీడీపీ పొత్తు - డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

కాంగ్రెస్ టీడీపీ పార్టీలు తెలంగాణ రాష్ర్టానికి ద్రోహం చేసేందుకే పొత్తు పెట్టుకున్నాయని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికలక పర్యటనలో బాగంగా పలు ఎన్నికల సభల్లో పాల్గొన్న అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ రాష్ట్రంలో గతంలోనే ధనిక రాష్ట్రం. 65 ఏండ్లు పాలించిన టీడీపీ, కాంగ్రెస్‌లు రాష్ర్టాన్ని అధోగతి పట్టించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్‌ఎస్ పార్టీ పాలనలో గత పాలకులు చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ చేసి చూపించారు. రైతులు కరెంటు అడిగితే టీడీపీ బషీర్‌బాగ్‌లో కాల్చి చంపింతే, కాంగ్రెస్ పార్టీ ముదిగొండలో కాల్చి చంపింది. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నారు. పంట పెట్టుబడి అందజేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం 12వేల కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపారు

రాష్ట్రం ఏర్పడితే కరెంటు ఉండదూ, హైదరాబాద్‌లో అల్లర్లు జరుగుతాయి, నక్సలిజం పెరుగుతుందన్న ఆంధ్రా పాలకుల ఆశలను వమ్ము చేస్తూ... సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారని చెప్పారు. ముస్లీం మైనార్టీలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత పాలకులు ముస్లీం ఓట్లు వేయించుకుని ఎన్నడూ పట్టించుకోలేదు. గత నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో మైనార్టీ గురుకుల పాఠశాలలు, షాదీ ముబారక్ లాంటీ పథకాలు అందించారు

రాష్ట్ర బడ్జెట్‌లో మైనార్టీలకు రూ. 2 వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆసరా పింఛలు అందుకుంటున్న అవ్వలు సీఎం కేసీఆర్‌ను తమ పెద్ద కొడుకుగా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ ద్వారా లబ్దీ పొందుతున్న చెల్లెండ్లు తమ అన్నగా ఆశీర్వదిస్తున్నారు. బంగారు తెలంగాణ ప్రగతి రథ చక్రం ఆగకూడదంటే టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఢిల్లీ,ఆంధ్రాల నుంచి ఆదేశాలు అందుకుని అభివృద్ధి నిరోధకులుగా నిలిచే కాంగ్రెస్ టీడీపీలు తెలంగాణ రాష్ర్టానికి అవసరం లేదని తేల్చి చెప్పారు.

Related Posts