YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రేపు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ

రేపు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ

నేడు ఉదయం 5.28 గంటలకు  కౌంట్‌డౌన్‌

: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్‌ నుంచి శుక్రవారం ఉదయం 9.28 గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి40 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. కౌంట్‌డౌన్‌ కార్యక్రమం గురువారం ఉదయం 5.28 గంటలకు ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు షార్‌లో చురుగ్గా జరుగుతున్నాయి. షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో బుధవారం మధ్యాహ్నం నుంచి రాకెట్‌ సన్నద్ధత సమావేశం(ఎంఆర్‌ఆర్‌) జరిగింది. ఇందులో రాకెట్‌కు సంబంధించిన పలు విషయాలను చర్చించారు. ఇందులో అధికారికంగా ప్రయోగ తేదీని ఖరారు చేశారు. రాత్రి లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశం (ల్యాబ్‌) జరిగింది. ఇందులో ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పీఎస్‌ఎల్‌వీ మనదేశానికి చెందిన కార్టోశాట్‌-2ఇ ఉపగ్రహంతోపాటు ఒక నానో, మైక్రో శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెడుతుంది. అలాగే విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలనూ నింగిలోకి పంపనున్నారు. ఇందులో 25 నానో, మూడు మైక్రో ఉపగ్రహాలు ఉన్నాయి. కెనడా, ఫిన్‌లండ్‌, ఫ్రాన్సు, కొరియా, యూకే, యూఎస్‌ఏకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి. 2016 ఆగస్టు తర్వాత తాజాగా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం చేసేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ గురువారం షార్‌కు రానున్నారు. 

Related Posts