YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

బీఎల్ఎఫ్ తో ఇంటిపార్టీ జత

బీఎల్ఎఫ్ తో ఇంటిపార్టీ జత

తెలంగాణ ఇంటి పార్టీ నుంచి మహాకూటమి నేతలకు తలనొప్పి తప్పెలాలేదు. మహాకూటమిలో చేరాలని మొదట్లో ఆ పార్టీతో కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తన దైన శైలిలో స్పందించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ఉద్యమకారులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు చెరుకు సుధాకర్ గత నాలుగున్నరేండ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో సగం వరకు సఫలీకృతులయ్యారనే చెప్పొచ్చు. ఒకట్రెండు నియోజకవర్గాల్లో మొద లైన ఇంటి పార్టీ ప్రస్థానాన్ని అతి తక్కువ కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు.మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇంటి పార్టీ భాగస్వామ్యం విషయంలో నిర్ణయం తీసుకోకపోతే.. బీఎల్‌ఎఫ్‌తో జతకట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ముమ్మరం చేసిన నేపథ్యంలో ఇంటి పార్టీ తోడైతే.. మహాకూటమికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన చెరుకు సుధాకర్‌కు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌లోని కొంతమంది మినహా మంత్రులు, ప్రజాప్రతినిధులతోనూ ఇప్పటికే టచ్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బీఎల్‌ఎఫ్‌తో జతక ట్టి ప్రజాసంఘాలతో ముందుకు నడిస్తే.. మిగిలిన వారికి గెలుపు గగనయ్యే పరిస్థితి ఉంది. చెరుకు సుధాకర్ సుదీర్ఘ కాలం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన వారు కావడంతో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఆదరణ ఉంది. ఉద్యమంలో చురుగ్గా ఉండి టీఆర్‌ఎస్ ప్రభుత్వం దూరం చేసుకున్న టీఆర్‌ఎస్ క్యాడర్, ప్రజాసంఘాల నాయకులతో నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే నాలుగైదు నియోజకవర్గాలను కైవసం చేసుకునే స్థాయికి పార్టీని తీసుకొచ్చారు. దాదాపు 15 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను మార్చగల సమీకరణాలను సునాయసంగా చెరుకు సుధాకర్ రూపొందిం చారు. ఇంటి పార్టీ ఉపా ధ్యక్షుడైన యన్నం శ్రీనివాస్‌రెడ్డి మహబూ బ్‌నగర్ జిల్లాలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే యన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఈ ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడంలో ఏమాత్రం తీసిపోరనే ప్రచారం ఉంది.నకిరేకల్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి అది ఎక్కువ సార్లు కమ్యూనిస్టుల చేతుల్లోనే ఉండిపోయింది. ఒకట్రెండు సార్లు మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకోగా, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. అయితే కమ్యూనిస్టులకు కంచుకోటగా మారిన నకిరేకల్ నియోజకవర్గంలో 2009 నియోజకవర్గ పునర్విభజనలో అప్పటి కాంగ్రెస్ నేతల ప్రయత్నాల కారణంగా కమ్యూనిస్టులకు బలమైన మండలంగా నిలిచిన శాలిగౌరారం మండలం తుంగతుర్తి నియోజకవర్గంలో చేరింది. దీంతో 2009 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం సీపీఎం నుంచి కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సీపీఎం దూరంగా ఉండడంతో ప్రజల్లో పూర్తిగా ఆదరణ కోల్పోయింది. దీంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీద టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. వాస్తవంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తారని అంతా భావించారు. కానీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసిన చెరుకు సుధాకర్ తన భార్య చెరుకు లక్ష్మీని బీజేపీ తరపున బరిలో నిలిపారు. దీంతో ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ ఓటమి ఖాయంగా మారింది. ఈసారి మహాకూటమి నుంచి టికెట్ వస్తుందని చెరుకు సుధాకర్ ఆశించారు. కానీ ఇప్పటికే ఉన్న తలనొప్పులతో మహాకూటమి నేతలు ఇంటి పార్టీకి అవకాశం ఇచ్చేలా కన్పించడం లేదు. దీంతో ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ నకిరేకల్ నుంచి పోటీ చేయడం ఖాయమంటున్నారు. మహాకూటమి నేతలు స్పందించి.. చెరుకు సుధాకర్ సీటు విషయంలో స్పష్టతకు రాకుంటే.. మరోసారి కాంగ్రెస్‌కు భంగపాటు తప్పెలా లేదు.

Related Posts