భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా నేడు అయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.. 2013 అక్టోబర్ 31 గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో మోదీ ఈ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. దాదాపు 182 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా రికార్డు సృష్టించింది. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ప్రఖ్యాత స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి ఇది రెట్టింపు ఎత్తులో ఉంటుంది. ఈ భారీ విగ్రహాన్ని ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సరోవర్ డ్యామ్ తో పాటు చుట్టుపక్కల ప్రకృతిని ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.