భారత క్రికెట్ ప్రస్తుతం ప్రమాదంలో ఉందని టీమిండియా మాజీ కెప్టెన్ ఆందోళన వ్యక్తం చేసారు. బీసీసీఐలో లైంగిక దాడుల ఆరోపణలు రావడం ఆందోళనకరమని, వాటిపై ఆలస్యంగా స్పందిస్తుండటం గందరగోళానికి కారణమవుతోందని తెలిపాడు. ఈ మేరకు బీసీసీఐ పాలకమండలికి ఒక లేఖ రాశాడు. బీసీసీఐ సీఈవో జోహ్రీపై వచ్చిన లైంగిక ఆరోపణల్లో ఎంత నిజం ఉందో తనకు తెలియదని... కానీ, ఈ అంశంపై స్పందించేందుకు బోర్డు ఎందుకు తాత్సారం చేస్తోందని గంగూలీ ప్రశ్నించాడు. పాలకమండలి సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని చెప్పాడు. తాము ఎటువైపు మొగ్గాలంటూ బోర్డులోని తన సన్నిహితులు తనను అడిగారని... వారికి ఏం చెప్పాలో కూడా తనకు అర్థం కాలేదని అన్నారు.