మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఎప్పటికపుడు కొత్త పొలిటికల్ కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూనే ఉన్నాయి. పీఆర్పీ పెట్టిన అన్నయ్య చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో కలిపి కేంద్ర మంత్రి అయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఇటీవల వరకు కొనసాగారు. మరోవైపు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించండి. వాళ్లు తప్పు చేస్తే ప్రశ్నిస్తానని…ఇపుడు తీరా ఎన్నికల ముందు వారితో వేరుపడి విమర్శలతో సరిపెడుతున్నాడు. ప్రజలకు జరిగిన నష్టాన్ని పవన్ పూడ్చలేడు. ఇపుడు జనసేన ఒంటరిగా పోటీచేసి అధికారంలోకి వస్తుందని బీరాలు పలుకుతున్నాడు పవన్. ఇదిలా ఉంటే.. తాజాగా మరో పార్టీ ఆ కుటుంబంలోకి ఎంటరయ్యింది. తెలంగాణలో ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ టికెట్ ఆశించిన అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి టికెట్ రాకపోవడంతో నిరాశ చెందారు. అయితే, ఆయన ఇబ్రహీం పట్నం నంచి ఎలాగైనా పోటీచేసి తీరాలని డిసైడ్ అయ్యారట. దీంతో రెండో ఆప్షన్‌గా మహాకూటమి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. టిక్కెట్ ఇస్తానంటే టీడీపీలోకి వస్తాను అంటున్నారు. 2014లో మంచి రెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన చంద్రశేఖర్‌రెడ్డి ఈసారి కచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకంతో ఉన్నారు. గెలుపోటములు తర్వాత గానీ… ఆయన ఇపుడు తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేస్తే మెగా కుటుంబంలో మరో కొత్త సందిగ్దం ఏర్పడుతుంది. సొంత మామ పోటీ చేస్తే టాప్ స్టార్ అయిన అల్లు అర్జున్ అతని తరఫున ప్రచారం చేయకుండా ఉండలేరు. కాబట్టి… టీడీపీకి ఓటేయమని ఆయన ప్రచారం చేయకతప్పదు. ఒకవైపు అన్న ఏమో టీడీపీకి ఓటేయొద్దని భారీ అవినీతి విమర్శలు చేస్తుంటే… అదే పార్టీకి ఓటేయమని అల్లుఅర్జున్ కోరాల్సి వస్తుంది. అది జరిగితే ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ -అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఉన్న గొడవలు ఇంకా పెద్దవి అవుతాయి. బాబాయ్ ఏం చెప్తే అది చేస్తానని ఇటీవలే రాంచరణ్ బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో రాంచరణ్ ఫ్యాన్స్‌తో కూడా అల్లుఅర్జున్ ఫ్యాన్స్‌తో విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. చివరకు రాజకీయాలు మెగా కుటుంబాన్నిముక్కలు ముక్కలు చేయనున్నాయి.