2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇతర దక్షణాది రాష్ట్రలకంటే మన రాష్ట్రంలో తలసరి ఆదాయం తక్కువగా ఉంది. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ,2029కి అభివృద్ధి,సంతోష సూచికలో దేశంలో నెంబర్ వన్ స్థానం ఏపీ వుందని మంత్రి లోకేష్ అన్నారు. బుధవారం నాడు అయన విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన వాల్ మార్ట్ స్టోర్ ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ 2050 కి పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోనే ఉత్తమ వేదికగా ఎదగాలని లక్ష్యం పెట్టుకున్నాం. అనుకున్న లక్ష్యాలు సాధించాలి అంటే 15 శాతం వృద్ధి సాధించాలి. ప్రస్తుతం 11 శాతం వృద్ధి సాధించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఈజ్ ఆఫ్ లివింగ్,గ్రామీణాభివృద్ధి లో నెంబర్ 1 గా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో విశాఖపట్నం కీలకపాత్ర పోషించబోతుంది. విశాఖపట్నం ఐటీ,మెడికల్ పరికరాల తయారీ,ఫార్మా రంగాలకు హబ్ గా మారబోతుందని అన్నారు. ఐదు సంవత్సరాలు రిటైల్ రంగంలో ఉన్నా. రిటైల్ బిజినెస్ చెయ్యడం ఎంత కష్టమో నాకు తెలుసు. సర్వీస్ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో రిటైల్ రంగం అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. యువత కష్ట పడి పనిచేస్తే జీవితంలో అనేక విజయాలు సాధిస్తారు. నేను రిటైల్ రంగంలో ఉన్నపుడు ఒక చిన్న ఉద్యోగిగా చేరిన వ్యక్తి కష్టపడి పనిచేసాడు. అతను ఈ రోజు 60 స్టోర్లు మ్యానేజ్ చేసే రీజనల్ బిజినెస్ మ్యానేజర్ స్థాయికి ఎదిగాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకు కాఫీ తరహాలో బ్రాండ్స్ అభివృద్ధి చెయ్యాలి అని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రకృతి వ్యవసాయం సహా ఇతర ఉత్పత్తులకు బ్రాండ్ తీసుకురావాలి అని ప్రయత్నిస్తున్నాం.రాబోయే కాలంలో 5 వేల లోకల్ బ్రాండ్స్ అభివృద్ధి చెయ్యాలి అని లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ లోకల్ బ్రాండ్స్ కి అంతర్జాతీయ గుర్తింపు ,మార్కెట్ కల్పించడంలో వాల్ మార్ట్ సహకరించాలి. ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్యం ఉన్న యువత ఉన్నారు...ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టోర్లతో పాటు,దేశ వ్యాప్తంగా ఉన్న స్టోర్లలో ఆంధ్రప్రదేశ్ యువత కి ఉద్యోగ అవకాశలు కల్పించాలని కోరారు.
వాల్ మార్ట్ లాబ్స్ ప్రెసిడెంట్ అండ్ సిఈఓ క్రిస్ అయ్యర్ మాట్లాడుతూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో 7 వాల్ మార్ట్ స్టోర్లు ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 14 వేల మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం. స్థానిక రైతుల నుండే ఉత్పతులను సేకరిస్తున్నాం.మార్కెటింగ్, ఎటువంటి పంటలు వెయ్యాలి అనే అంశాల్లో రైతులకు సహకారం అందిస్తున్నమని అన్నారు.