YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో దిగజారుతున్న శాంతిభద్రతలు

 ఏపీలో దిగజారుతున్న శాంతిభద్రతలు

ఏపీలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి. తిరుపతి పర్యటనలో ఉన్న పురందేశ్వరి.. ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడి ఘటనపై స్పందించారు. ఏపీ ప్రభుత్వం టార్గెట్గా మండిపడ్డారు. వైఎస్ జగన్పై దాడి జరగడం దురదృష్టకరమని.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు పురందేశ్వరి. ఓ బాధ్యత గల ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే.. కత్తి అంగుళం దిగిందా.. అర అంగుళం దిగిందా అంటూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలపై దాడి జరిగిందని.. ఇప్పుడు జగన్పై అన్నారు. ఈ ఘటనలన్నీ చూస్తుంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతమాత్రం అదుపులో ఉన్నాయో అర్దమవుతుందన్నారు. జగన్పై దాడికి పాల్పడిన వ్యక్తికి పోలీసులే మంచి వ్యక్తని సర్టిఫికేట్లు ఇస్తున్నారని విమర్శించారు. జగన్ పై దాడికి పాల్పడిన వ్యక్తికి నేరచరిత్ర ఉన్నట్లు తేలిందని.. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిస్పక్షపాతంగా విచారణ జరపాలన్నారు. కేంద్రంలో అవినీతి పెరిగిందంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. కేంద్రం కాదు.. ఏపీలో అవినీతి పెరిగిందని విమర్శించారు. దేశం సర్వతోముఖాభివృద్థి సాధించే దిశగా మోడీ ముందుకు తీసుకెళుతున్నారని ప్రశంసలు కురిపించారు. బీజేపీని ఓడించడం.. మోదీని గద్దె దించడం ఎవరికి సాధ్యం కాదన్నారు. ఎన్నికల్లో పోటీపై స్పందిస్తూ.. అధిష్టానం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు.

Related Posts