YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డిసెంబర్ చివరి నాటికి అమరావతిలో హైకోర్టు ఏర్పాటు

డిసెంబర్ చివరి నాటికి  అమరావతిలో హైకోర్టు  ఏర్పాటు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జడ్జి గా తానున్న సమయంలోనే ప్రస్తుత అమరావతి  హైకోర్టు నమూనాను ఆమోదించడం జరిగిందని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్కుమార్కైట్పేర్కొన్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లోజరిగిన అమరావతి రాజధాని నగర జస్టిస్ సిటీ పై సి.ఆర్.డి.ఏ. నిర్వహించిన వర్కుషాప్ లో ఆయన మాట్లాడుతూ అమరావతి హైకోర్టు నమూనా ఎంపికచేసే  కమిటీసభ్యుని గా  తాము సి.ఆర్.డి.ఏ సమర్పించిన 3 నమూనాలను పరిశీలించామని న్యాయమూర్తి అన్నారు. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు జరుగుతున్న నేపాధ్యంలో ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి హైకోర్టు ను అమరావతిలో ఏర్పాటు చేస్తారని తాము భావిస్తున్నట్లు అయన పేర్కొన్నారు. అమరావతి లో  హైకోర్టు   తదితర భవనసముదాయాలనుఅత్యంత వేగంగా నిర్మించుతున్న సి.ఆర్.డి.ఏ కమీషనర్ చెరుకూరి శ్రీధర్ ను న్యాయమూర్తి జస్టిస్ సురేష్కుమార్ కైట్ అభినందించారు. వివిధ సమయాల్లో తమ కమిటీ సభ్యులకు కోరిన వివరాలు అందించడంలో శ్రీధర్ చూపిన చొరవ అభినందనీయమన్నారు.ఢిల్లీ హైకోర్టు కు చెందిన మరో న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ మాట్లాడుతూ హై కోర్టు భవనాలు ప్రజలకు ,న్యాయ వ్యవస్థ అందుబాటులో వుండే విధం గా ప్రజలకు చేరువగా వుండాలని అన్నారు. అమరావతి హై కోర్టుభవనాల డిజైన్ లు ఉదాత్తంగా ఉన్నాయన్నారు. దేశంలోనే ప్రప్రధమంగా కొత్త గా న్యాయ నగరాన్ని నిర్మించడం ముదావహం అన్నారు. న్యాయ వ్యవస్థ పనితీరుకు సౌలభ్యంగా వుండే విధంగా , కోర్టు హాళ్లు వైశాల్యం, వాటికిఅనువైన వసతులు కల్పించడం ద్వారా అమరావతి న్యాయ నగరం ఇతర రాష్ట్రాల హైకోర్టులకు ప్రామాణికంగా నిలవాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఢిల్లీ హైకోర్టు కు చెందిన మహిళా  న్యాయమూర్తిజస్టిస్ శ్రీమతి ప్రతిభాసింగ్ మాట్లాడుతూ అమరావతి హైకోర్టు పవిత్రమైన స్థూపాకారంలో వుండి పేరుకు తగ్గట్టు పవిత్రమైన న్యాయాన్ని అందిస్తుందన్నారు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్. వి. రమణ, జస్టిస్ వినీత్ శరన్ ల తో బాటు  ఢిల్లీ హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సురేష్కుమార్కైట్, జస్టిస్ రవీంద్ర భట్ , జస్టిస్ ప్రతిభా సింగ్ లు అమరావతి న్యాయనగరంపైసి.ఆర్.డి.ఏ కమీషనర్ చెరుకూరి శ్రీధర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషను ఆసక్తి గా వీక్షించి, హైకోర్టు అంతర నిర్మాణాలపై పలు అంశాలను అడిగి తెల్సుకున్నారు. అంతకు ముందు న్యాయమూర్తులు అమరావతి ప్రభుత్వనగర మాస్టర్ ప్లాన్ నమూనా ను తిలకించి పూర్తి సమాచారాన్ని అడిగి తెల్సుకున్నారు. హైకోర్టు నమూనా ను వివరించి  అందులో ఏర్పాటయ్యే పలు వసతులను సి.ఆర్.డి.ఏ కమీషనర్ చెరుకూరి శ్రీధర్ న్యాయమూర్తులకువివరించారు.అంతకు ముందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థితిగతులను ప్రగతి విశేషాలను ఏ.పి. భవన్  రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ఆహూతులకు వివరించారు.  ఏ.పి.సి. ఆర్. డి. ఏ. కమీషనర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ అమరావతిప్రభుత్వ నగర నిర్మాణం లో 21 వేల  మంది కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారన్నారు. అమరావతి న్యాయ నగరం లో ప్రస్తుతం నిర్మిస్తోన్న సిటీ సివిల్ కోర్టు లో తాత్కాలికంగా హైకోర్టు ను ఏర్పాటుచేయబోతున్నామన్నారు. బౌద్ధ స్థూపాకారంలో నిర్మించే శాశ్వత హైకోర్టు దీనికి సుమారు 500 మీటర్ల దూరంలోనే ఉంటుందన్నారు. వీటికి సమీపంలోనే లాయర్ ల కోసం "లాయర్ చాంబర్ ప్రాజెక్ట్ " ను నిర్మిస్తున్నట్లుతెలిపారు. లాయర్ల వృత్తిపరమైన కార్యాలయాలతోబాటు వారికి నివాసంకూడా వుండేలా ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ లు నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్రెండుఏళ్ళ లో పూర్తి చేయనున్నట్లు అయన పేర్కొన్నారు. ఈ వర్క్ షాప్ను ఢిల్లీ లోని సెంటర్ ఫర్ స్ట్రాటజీ అండ్ లీడర్ షిప్ సంస్థ, ఏ.పి. భవన్ , ఏ.పి.సి. ఆర్. డి. ఏ లు సంయుక్తం గా నిర్వహించాయి.  వర్క్ షాప్ లో  ఏ.పి. భవన్ఇడిబి ప్రత్యేక కమీషనర్ శ్రీమతి భావనా సక్సేనా, సెంటర్ ఫర్ స్ట్రాటజీఅండ్ లీడర్ షిప్ సంస్థ సి.ఇ. ఓ. వికాస్ శర్మ, న్యాయ వ్యవస్థ కు చెందిన పలువురు న్యాయవాదులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Related Posts