జోరుమీదున్న భారత జట్టు సొంతగడ్డపై మరో సిరీస్ విజయంపై కన్నేసింది. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన.. గురువారం చివరిదైన ఐదో వన్డేలో వెస్టిండీస్‌ను ఢీకొంటుంది. టాప్ ఆర్డర్ సూపర్ ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో టీమ్ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరో వైపు సమష్టిగా రాణించి భారత్‌ను అడ్డుకోవాలని విండీస్ భావిస్తోంది. మ్యాచ్‌కు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశముంది.