వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత 11 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తయి, 12 జిల్లా అయిన విజయనగరంలో ముగింపు దశకు చేరుకుంది. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర గత ఏడాది నవంబరులో పూర్తయింది. అంటే దాదాపు మరో వారం రోజుల్లో ఏడాది పూర్తి చేసుకుంటుంది.నవంబరు 6వ తేదీకి సంవత్సరం పూర్తి చేసుకుంటుండటంతో అదే రోజు పార్వతీపురంలో భారీ బహిరంగ సభను జగన్ పార్టీ నిర్వహించనుంది. ఏడాది పూర్తయిన సందర్భంగా భారీ జన సమీకరణకు కూడా శ్రీకారం చుట్టారు. అయితే ఈసారి ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమవుతుండటంతో జగన్ కు పూర్తి స్థాయి భద్రతను పార్టీయే చూసుకోనుంది. జగన్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది.జగన్ పై గత నెల 25వతేదీన విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి నేపథ్యంలో జగన్ కు మరింత భద్రతను పెంచాలని నిర్ణయించారు. జగన్ తన శిబిరం నుంచి బయటకు రాగానే ప్రజలతో మమేకం అవుతుంటారు. వారి నుంచి వినతి పత్రాలను స్వయంగా తీసుకున నేరుగా మాట్లాడుతుంటారు. యువతీ, యువకులువచ్చి సెల్ఫీలు అడిగితే కాదనరు. గత ఏడాద నుంచి ఇదే జరుగుతుంది. కానీ ఎక్కడా ఎటువంటి సంఘటన చోటు చోసుకోలేదు. జగన్ నేరుగా స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శలు చేసినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ విశాఖ ఎయిర్ పోర్ట్ లో హత్యాయత్నానికి యువకుడు శ్రీనివాస్ ప్రయత్నించడంతో పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఉన్న జగన్ కు భద్రతను ఒకసారి పరిశీలిస్తే…. మొత్తం 80 మంది వరకూ జగన్ కు భద్రత కల్పిస్తున్నారు. వీరు షిప్ట్ ల వారీగా విధులు నిర్వహిస్తుంటారు. జగన్ శిబిరంలో విశ్రాంతి తీసుకునే సమయంలోనూ వెలుపల భద్రత ఉంటుంది. ఈ 80 మందిలో ప్రభుత్వం ఇచ్చిన పది మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు పాదయాత్ర ప్రారంభమయిన తర్వాత జనం మీద పడకుండా రోప్ పార్టీని నిర్వహించే సిబ్బంది సుమారు 50 మంది వరకూ ఉన్నారు. ఇక పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో లోకల్ కానిస్టేబుళ్లు జగన్ కు రక్షణ కల్పిస్తున్నారు. ఇక జగన్ తాను ప్రత్యేకంగా పదిహేను మంది ప్రయివేటు సిబ్బందిని నియమించుకున్నారు. వీరిలో పదవీ విరమణ చేసిన ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు.జగన్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత తిరిగి ఈ నెల 3వ తేదీ నుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుండటంతో జగన్ కు ప్రత్యేక భద్రత ఏర్పాుటు చేయాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను వైసీపీ నేతలు కోరారు. ఇక జగన్ కు ఏపీ సర్కార్ కేటాయించిన వాహనాలు కూడా ఫిట్ నెస్ లేవు. గతకొంతకాలంగా ప్రభుత్వానికి వైసీపీ నేతలు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి వాహనాలను మార్చాలని ప్రభుత్వాన్నికోరనున్నారు. అంతేకాకుండా జగన్ పాదయాత్రలో ప్రభుత్వ సెక్యూరిటీపై ఆధారపడకుండా సొంత భద్రతను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పదిహేను మంది ప్రయివేటు సిబ్బందికి బదులుగా యాభై మందికి పెంచనున్నారు. జగన్ కు దరిదాపుల్లో సొంత సైన్యమే ఇక ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.