విద్యార్థులు చదువుతో పాటు క్రీడలోనూ రాణించాలి. చదువుతో పాటు క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు సైతం మెరుగ్గా ఉంటాయి. రాష్ట్రం నుండి క్రీడల్లో రాణిస్తున్న పీవీ సింధూ, కిదాంబి శ్రీకాంత్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ స్పీకర్ కోడెల శివఫ్రసాద రావు సూచించారు. గురువారం నరసరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో 64 వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్ సియం కప్ అండర్ .17 వాలిబాల్ పోటీ లను ప్రారంభించారు. కోడెల మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రత్యేకంగా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో క్రీడా ప్రాగణాల అభివృద్ధి చేయడం జరుగుతుంది. గతంలో మురికికూపంలా ఉన్న ఈ స్టేడియంను అధ్బుతంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. నేడు రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద క్రీడా ప్రాగణాలలో నరసరావుపేట స్టేడియం ఒకటి. ప్రతి ఒక్కరూ తమ రోజులో గంటసేపు వ్యాయామానికి కేటాయించాలి.... అప్పుడే ఆరోగ్యంగా, ఆహ్లదంగా ఉంటారని అయన అన్నారు.