YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు

తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు

ఆంధ్రా ప్రజలకు అన్యాయం జరుగుతోంది అని యన్ టి ఆర్ అప్పట్లో  టిడిపి ని స్థాపించారు. కానీ చంద్ర బాబు నాయుడు ఆయన ఆత్మ గోషించే విధంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాలుగు అయిదు సీట్ల కోసం రాహుల్ దగ్గరకి వెళ్లడం తో  తెలంగాణ లో టిడిపి లేదని అర్ధం అవుతోందని ఎంపీ బోయినిపల్లి వినోద్  కుమార్ అన్నారు. గురువారం అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలు బీజేపీతో కలిసి ఉండి ఎందుకు బయటకు వచ్చారు..? మోదీ కి బాబు కు ఎక్కడ లావా దేవిల్లో తేడా వచ్చింది.? రాహుల్ గాంధీ ఈ మధ్య కాలం లో స్పెషల్ స్టేటస్ డ్రామా ఆడారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎపి ప్రజలను,రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న పరిశ్రమ లకు ఇబ్బంది కలగకుండా ఏపీ కి స్పెషల్ స్టేటస్  ఇస్తాం అని రాహుల్ గాంధీ చంద్రబాబు కి చెప్పారా లేదా క్లారిటీ ఇవ్వాలని అన్నారు. ఏపీ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వొద్దని గతం లో కర్ణాటక,తమిళనాడు ముఖ్యమంత్రులు కూడా మోడీ కి లేఖ రాశారు. ఏపీ కి ఆర్ధికంగా సహాయం చేస్తే మాకు ఏం ఇబ్బంది లేదు. మహా కూటమి తెలంగాణ లో నిలువదు ..ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మాయావతి, అఖిలేష్ యాదవ్ లు ఎట్టి పరిస్తుతుల్లో కాంగ్రెస్ తో  కలవలేరని అయన అన్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక శక్తి గా మారి.. కేంద్రం తల వంచి పనులు చేయించే విధంగా ఉండాలి. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు ఢిల్లీ కి తాకట్టు పెట్టడానికి వెళ్లారని అయన విమర్శించారు.

Related Posts