YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ సభ్యత్వ నమోదు షురూ

టీడీపీ  సభ్యత్వ నమోదు షురూ

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది... ప్రతీ రెండేళ్లకోసారి టీడీపీ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది.2018-20 సంవత్సరాలకుగాను సభ్యత్వ నమోదు మొదలుపెట్టింది.  పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తొలి సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత అనేక ప్రాంతాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ సభ్యత్వాలు నమోదు చేసుకుని లాంఛనంగా ప్రారంభించారు.  సభ్యత్వ నమోదు చేసుకున్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ కార్యకర్తలపై ప్రశంసలు కురిపించారు.  తెలుగుదేశం సభ్యత్వం అంటే గౌరవంగా భావిస్తారని, కార్యకర్తలు కూడా సేవాభావం అంకితభావం కలిగిన సైనికుల్లా పనిచేస్తారన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో మొదలైన తెలుగదేశం పార్టీ ప్రస్దానం మూడున్నర దశాబ్దాలుగా అదేస్పూర్తితో ముందుకు సాగుతుందని అన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్ని సభ్యత్వాలు టీడీపీకి ఉన్నాయని చంద్రబాబు అన్నారు... ప్రత ఒక్కరు సభ్యత్వ నమోదు చేసుకోవడంతో పాటుగా పెద్దఎత్తున కొత్త సభ్యత్వాలు నమోదు చేయించాలని పిలుపు నిచ్చారు. తెలుగు రాష్ట్రాలలో 70 లక్షలపైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సభ్యత్వాలు ఉన్నాయి. 2016 - 18 సంవత్సరంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 64 లక్షలకుపైగా కార్యకర్తలు టీడీప సభ్యత్వం తీసుకుంటే... తెలంగాణలో ఏడు లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయి. తాజాగా జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిపార్టీ అధిస్టానం మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  దీనిపై యువనేత మంత్రి లోకేష్ అనేక సమాలోచనలు చేసి సిస్టమ్ రెఢీ చేశారు. దేశంలో ఏ పార్టీకి లేనట్లుగా సభ్యత్వ  నమోదుకు సాంకేతికత జోడించారు. సభ్యత్వం నమోదు చేసుకున్న వెంటనే ప్రింటెడ్ రశీదు ఇచ్చి  కార్యకర్తకు కార్డు చేరే వరకు పాలో అప్ చేసేలే  సిస్టమ్ ఏర్పాటు ఉంది. దీనిని పర్వవేక్షించేందుకు ప్రత్యేకమైన కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తూ..  ఎప్పటి కప్పుడు ఏఏ బూత్ లో ఎన్ని సభ్యత్వాలు నమోదు అయ్యాయో డేటాను సిద్దం చేస్తారు.  సభ్యత్వ నమోదులో ఏమైనా సమస్య అనిపిస్తే నేరుగా కమాండ్ కంట్రోల్ రూమ్ కి కంప్లైట్ చేసే వెసులుబాటుని కూడా కల్పించారు. బూత్ లెవల్ నుంచి పార్లమెంట్ నియోజవకవర్గం వరకు సభ్యత్వ నమోదు ఏమేరకు జరిగిందో డేటా ఎప్పటి కప్పుడు లోకేష్ టేబుల్ మీద ఉంటుంది. ఆయా పరిస్ధితులను బట్టి  నాయకులకు సూచనలు సలహాలు అదిష్టానం నుంచి వెళ్తాయి.  జాతీయ కార్యదర్శి హోదాలో లోకేష్ కూడా సభ్యత్వ తీసుకున్నారు. తర్వాత ఆయన మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు హింసించినా, చంపించినా కార్యకర్తలు జెండాను వీడలేదని కొనియాడారు.సాధారణ సభ్యత్వంతో పాటుగా ఈ సారి టీడీపీ 100 రూపాయల క్రీయాశీలక సభ్యత్వం కూడా అందుబాటులో ఉంచింది. క్రీయశీలక సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల భీమ సౌలభ్యాన్ని కల్పించింది... ఏమైనా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ పెద్దఎత్తున సభ్యత్వాలు నమోదుకు శ్రీకారం చుట్టింది.

Related Posts