ప్రకాశం జిల్లా లో నిసీఎం పర్యటనను విజయవంతం చేద్దామని పురపాలక శాఖ మంత్రి నారాయణ పార్టీ నేతలకు కార్యకర్తలకు పిలుపిచ్చారు.మంత్రి గురువారం ఒంగోలు నందు విలేకరులకు ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు.ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారు. ముఖ్యంగా సీఎం వెలుగొండ ప్రాజెక్టు ను పరిశీలిస్తారని మంత్రి తెలిపారు.అనంతరం గ్రామాదర్శిని కార్యక్రమం లో సీఎం పాల్గొంటారన్నారు. మత్తూర్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లోపాల్గొనిఅనంతరం పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని మంత్రి వివరించారు.పట్టణంలోనిఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ నేతలసంవేశం లో సీఎం పాల్గొంటారన్నారు.రాత్రి సీఎం ఒంగోలు నందు బస చేస్తారని మంత్రి తెలిపారు.ఇప్పటికే సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు కృషి చేశారని మంత్రి పేర్కొన్నారు.పట్టణం లోని ఏర్పాట్లను పరిశీలించామని మంత్రి శిద్దా రాఘవరావు తో పాటు పలు నేతలు పాల్గొన్నట్లు మంత్రి వివరించారు.