YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్‌ గాంధీతో ఏపి సిఎం చంద్రబాబు భేటీ

 రాహుల్‌ గాంధీతో ఏపి సిఎం చంద్రబాబు భేటీ

‘జాతిని రక్షిద్దాం... ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం’ అనే నినాదంతో ఎన్డీయే వ్యతిరేక పక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు స్వయంగా నడుం బిగించిన చంద్రబాబు.. గురువారం మద్యాన్నం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా దేశంలో జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు కాంగ్రెస్‌తో స్నేహంపై వ్యూహాత్మంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపైనే ఉంటుందని రాహుల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సఖ్యతకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. తాజాగా, భాజపాయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా చంద్రబాబు రాహుల్‌తో భేటీ అయ్యారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుపై ఆయనతో చర్చించనున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే శరద్ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లాలతో సీఎం భేటీ అయినవిషయం తెలిసిందే. రాహుల్‌తో భేటీలో సీఎం వెంట ఎంపీలు సీఎం రమేశ్‌, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు ఉన్నారు.భాజపాపై సమరశంఖం పూరించిన తెదేపా జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగేశారు.

Related Posts