YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

 ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

గురువారం ట్రేడింగ్లో దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం 150 పాయింట్లకు పైగా లాభాలతో సెన్సెక్స్. 10,400 పైనా నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభించాయి. రూపాయి బలపడటం, అంతర్జాతీయ  మార్కెట్లు పాజిటివ్ సంకేతాలతో లాభాల్లో సాగాయి. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 100 పాయింట్ల వరకు  నష్టపోయింది. ట్రేడింగ్లో బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్ షేర్లు లాభాలను ఆర్జించగా.. ఐటీ, ఫార్మా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 10 పాయింట్ల నష్టంతో 34431.97 వద్ద ఫ్లాట్గా ముగియగా.. నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 10,380 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ మాత్రం 0.8 శాతం లాభంతో 149.80 పాయిట్ల వద్ద ముగిసింది. డాలరుతో  రూపాయి మారకం విలువ 36 పైసలు బలపడి 73.60 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ (+8.48), హిండాల్కో (+3.39), యాక్సిస్ బ్యాంక్ (+3.39) యూపీఎల్ (+3.20),  బీపీసీఎల్ (+3.04) షేర్లు అధిక లాభాలు గడించగా.. హెచ్సీఎల్ టెక్ (-4.42), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (-3.18), టెక్ మహింద్రా (-3.12), భారతీ ఇన్ఫ్రాటెల్ (-2.99), ఇన్ఫోసిస్ (-2.87) షేర్లు  అధికంగా నష్టపోయాయి.

Related Posts