YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

రిలయన్స్ జియో తన హవా

 రిలయన్స్ జియో తన హవా

టెలీకాం రంగంలో రిలయన్స్ జియో తన హవా కొనసాగిస్తోంది. దేశంలోని 22 టెలీకాం సర్కిళ్లలో అత్యధిక శాతం 4జీ నెట్వర్క్ను కలిగిన ఆపరేటర్గా జియో నిలిచింది. మొత్తం 96.70 శాతం 4జీ  నెట్వర్క్ను జియో అందిస్తోంది. ఈ మేరకు వైర్లెస్ కవరేజ్ మ్యాపింగ్ సంస్థ ఓపెన్సిగ్నల్ వెల్లడించిన నివేదికలో స్పష్టమైంది. ‘మొబైల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్’ పేరిట ఓపెన్సిగ్నల్ విడుదల చేసిన నవంబర్ 2018 నివేదిక ప్రకారం.. 4జీ నెట్వర్క్ కవరేజ్లో జియో తరవాత ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉంది. మొత్తం నెట్వర్క్లో ఎయిర్టెల్ 73.99 శాతం 4జీ సదుపాయాన్ని అందిస్తోంది. 73.71  శాతం 4జీ నెట్వర్క్తో ఐడియా మూడో స్థానంలో ఉంది. వొడాఫోన్ 4జీ నెట్వర్క్ 72.59 శాతంగా ఉంది. గతంతో పోలిస్తే జియో 4జీ నెట్వర్క్ స్థాయి పెరిగిందని ఓపెన్సిగ్నల్ పేర్కొంది. 96.4 శాతం నుంచి 96.7 శాతానికి జియో 4జీ నెట్వర్క్ వ్యాప్తి చెందిందని వెల్లడించింది. అయితే డౌన్లోడ్ స్పీడ్లో మాత్రం జియో వెనకబడింది. ఈ విషయంలో జియోను ఎయిర్టెల్ అధిగమించింది.
అత్యధికంగా 7.53 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడుతో ఎయిర్టెల్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక 5.47 ఎంబీపీఎస్ స్పీడుతో రిలయన్స్ జియో రెండో స్థానంలో ఉంది. 5.20 ఎంబీపీఎస్ స్పీడుతో వొడాఫోన్  మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఇక 4.92 ఎంబీపీఎస్ స్పీడుతో ఐడియా, 2.70 ఎంబీపీఎస్ స్పీడుతో బీఎస్ఎన్ఎల్ వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, అప్లోడ్ స్పీడ్లో  ఐడియా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అప్లోడింగ్లో ఐడియా అత్యధికంగా 2.88 ఎంపీబీఎస్ను అందించింది. ఇక 2.31 ఎంబీపీఎస్ అప్లోడ్ స్పీడుతో వొడాఫోన్ రెండో స్థానంలో ఉంది. ఎయిర్టెల్ 1.90 ఎంబీపీఎస్, జియో 1.58 ఎంబీపీఎస్ అప్లోడ్ స్పీడ్స్తో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 0.78 ఎంబీపీఎస్ అప్లోడ్ స్పీడుతో ప్రభుత్వరంగ టెలీకాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆఖరి స్థానంలో ఉంది. కాగా, భారతీయులు మొబైల్స్లో ఆన్లైన్ వీడియోలను బాగా చూస్తున్నారని.. గతంతో పోలిస్తే వీడియోలు చూసే సమయం బాగా పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం 90 రోజులపాటు దేశంలోని 22 టెలీకాం సర్కిళ్లలో డాటాను సేకరించి ఈ నివేదిక రూపొందించినట్లు ఓపెన్సిగ్నల్ తెలిపింది. ఈ 90 రోజుల కాలంలో 1.7 మిలియన్ల  డివైజ్ల నుంచి 10.5 మిలియన్ల కంటే అధికంగా ప్రమాణాలను విశ్లేషించినట్లు పేర్కొంది. భారత్లోని ఐదు ప్రధాన టెలీకాం ఆపరేటర్లు అయిన ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, ఐడియా, వొడాఫోన్లు అందించే 4జీ సదుపాయం, డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్, వీడియో ఎక్స్పీరియన్స్ల ఆధారంగా ఈ నివేదికను తయారుచేసినట్లు వెల్లడించింది.

Related Posts