YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రామకృష్ణాపురం నుండి ఊట గుండం రెండు కిలోమీటర్ల రోడ్డు చాలా పాడైపోయింది..!!

రామకృష్ణాపురం నుండి ఊట గుండం రెండు కిలోమీటర్ల రోడ్డు చాలా పాడైపోయింది..!!

రామకృష్ణాపురం నుండి ఊట గుండం రెండు కిలోమీటర్ల రోడ్డు చాలా పాడైపోయింది. అతి కష్టం మీద ఆర్టీసీవారు బస్సు నడుపుతున్నారు. ఈ ఊరిలో నీ  విద్యార్థినీ విద్యార్థులకు కోడూరు కి వెళ్ళాలంటే బస్సు సర్వీసు మాత్రమే ఆధారం.ఈ మధ్యకాలంలో ఊటగుండం ప్రాంతం నుండి మట్టిని పెద్ద టిప్పర్స్ ద్వారా తరలిస్తున్నారు. ఈ శివారు ప్రాంతం కి నీరు రాక సంవత్సరంలో పండే ఒక పంట కూడా అతికష్టంతో పండిస్తున్నారు. నీటి గురించి రైతులు రోడ్డు ఎక్కటం పత్రికాముఖంగా రాష్ట్రవ్యాప్తంగా తెలిసింది. కొంతమంది అయితే అరెస్టు కూడా అయ్యారు. ఈ టిప్పర్స్ తిరగటం వలన రోడ్డు పూర్తిగా పాడైపోవటం ఆర్టీసీవారు బస్సు ను ఆపేస్తామని  చెప్పటంతో పైగా రోడ్డు కూడా పూర్తిగా పాడైపోవడంతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి మారుమూల గ్రామాల రోడ్లను టిప్పర్స్ ద్వారా పాడు చేయడం గ్రామస్తులకు మరింత బాధ కలుగుతుంది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి   గ్రామస్తులకు సహాయం చేయాలి.

Related Posts