విజయ్ సేతుపతి, త్రిష జంటగా వచ్చిన తమిళ సినిమా '96' మంచి విజయం సాధించింది. ఈ చిత్రం చుట్టూ కాపీ వివాదం ముసురుకుంటోంది. ఈ చిత్రానికి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ, 'నా అసిస్టెంట్ సురేశ్ రాసుకున్న కథ ఇది. ఈ కథ మరుధ పాండియన్ అనే వ్యక్తి ద్వారా ప్రేమ్ కుమార్ కి వెళ్లింది. గతంలో సురేశ్ కి స్నేహితుడిగా వున్న మరుధ పాండియన్ మోసం చేశాడు' అన్నారు. ఈ విషయంపై ప్రేమ్ కుమార్ స్పందిస్తూ .. 'ఈ ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. అందరి జీవితాల్లో కామన్ గా జరిగే సంఘటనలతో ఈ కథను రూపొందించాను. ఈ సినిమా హిట్ కావడం వలన ఇలా కుట్ర చేస్తున్నారు.