YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

కాశీ ఖండం –44... శ్రీ కేదారేశ్వర మహాత్మ్యం..!!

 కాశీ ఖండం –44... శ్రీ కేదారేశ్వర మహాత్మ్యం..!!

ఒకసారి పార్వతి దేవి భర్త అయిన పరమశివుని కాశీ క్షత్రం లో కేదార ఖండ విశేషాలను తెలియ జేయమని కోరింది .అప్పుడు శివుడు ఈ విధం గా చెప్పాడు .పూర్వం ఉజ్జయిని పట్టణం లో ఒక బ్రాహ్మనుడుండేవాడు .ధర్మ పత్ని తో సహజీవనం చేస్తున్న దరిద్రుడు .పుత్ర సంతానం లేదు మహా కాలుడిని  భక్తితో సేవిస్తున్నాడు .కొంత కాలానికి ఈశ్వరానుగ్రహం వల్ల పుత్రోదయం జరిగింది ఆబాలుడికి వసిష్టుడు అని పేరు పెట్టారు .ఎనిమిదో ఏట ఉపనయనం చేశారు .రోజు దశ సహస్ర గాయత్రి జపం చేసే వాడు వసిష్టుడు .అకస్మాత్తుగా తల్లి మరణించింది ..మరో ఏడాదికి తండ్రిని కోల్పోయాడు .వికల మనస్కుడైన ఆ బాలుడు మంచి గురువును అన్వేషించి పరమార్ధ జ్ఞానం పొందాలని భావించాడు .

          కాశీ క్షేత్రానికి చేరాడు .అక్కడ గంగా స్నానం విశ్వనాదాది దేవతా సందర్శనం  చేశాడు .హిరణ్య గర్భుడు అనే గురువు అనుగ్రహం పొందాడు .పంచాక్షరి దీక్ష పొందాడు .అచంచల భక్తీ తో విశ్వనాధుని కొలుస్తున్నాడు .శివుడే గురువు ,గురువే శివుడు అనే భావం కలిగింది .ఒక రోజు గురువు తనకు కేదార క్షేత్రం దర్శించి కేదా రేశ్వరుడిని కనులారా చూచి ధన్యం కావా లని ఉందని చెప్పాడు .అలాంటి క్షేత్రానికి తానూ చూడాలని ఉందని శిష్యుడన్నాడు .ఇద్దరు కేదారం బయల్దేరి వెళ్లారు .

    ‘’కేదారే ఉదకం పీత్వా –పునర్జన్మ న విద్య తే ‘’అనే కేదారఖండ గ్రంధ ప్రమాణం గా తీసుకొని ‘’రేత కుండం ‘’లోనీ అద్భుత మహిమాన్విత జలాన్ని స్వీకరిస్తే పునర్జన్మ ఉండదని గ్రోలారు .కేదారేశ్వర దర్శనం చేసి జన్మ చరితార్ధం చేసుకొన్నారు .కేదారేశుని చూస్తుండి పోయిన గురువు కన్నుల లో నుంచి జ్యోతి బయటకు వచ్చి ఆకాశమార్గం లోకి వెళ్లటం,దివ్య విమానం లో దేవతలు వచ్చి ఆయన్ను తీసుకు వెళ్లటం  అందరు గమనించారు .శిష్యుడు వశిష్టుడు గురువు గారి అంత్య క్రియలను భక్తితో విధి విధం గా  చేశాడు .కాశీ చేరి గురువు గారి ఆదర్శాలను అమలు చేయటానికి పీఠాన్ని అధి రోహించాడు .

      నిత్య గంగా స్నానం విశ్వనాధ దర్శనం పరమశివ ధ్యానం తో కాలం గడిపాడు .అనుక్షణ దైవనామ జప తపాల తో జీవితాన్ని అర్ధ వంతం గా కోన సాగిస్తున్నాడు .శివుడు పరమ ప్రీతీ చెంది దర్శనమిచ్చాడు .వరం కోరుకో మన్నాడు అప్పుడు వసిష్టుడు ‘’దేవా !ఎక్కడో హిమాలయాలలో నువ్వు ఉంటావు .నీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకో లేని వా రెందరో ఉన్నారు .కనుక కేదార ,విశ్వనాధ జ్యోతిర్లింగాలు రెండు కలిసి కాశీ లో నె ఉండేట్లు నీవు కరుణిస్తే నీ భక్తులు ధన్యు లవుతారు ‘’అని కోరాడు /.ఆతని కోరిక ను నేర వేరుస్తాను అని శివుడు అన్నాడు ‘’నీ కోసం ఏదీ కోరుకో కుండా ,అందరికోసం కోరావు చాలా సంతోషం .నీ ముక్తి నీ స్వాధీనం ‘’అన్నాడు ..హిమాలయం లోనీ సర్వ తీర్ధాల గౌరీ కుండం హంస తీర్ధం మొదలైన వాటి శక్తు లన్ని వశిష్ట నివాసం దగ్గరున్న ‘’హర పాప హ్రద ‘’తీర్ధం లో నిక్షిప్తం అవుతాయి .అరవై నాలుగు కళల్లో ఒక్క కళ ను మాత్రమె కేదార క్షేత్రం లో నిలిపి మిగిలిన సర్వ కళలను  కేదార్ ఘాట్ ఒడ్డున ఉన్న కేదారేశ్వరునిలో లీన మాఎట్లు చేసి భక్తుని కోరిక తీరి కాశి లో కేదార క్షేత్రం వెలిసింది ..కేదార్ ఘాట్ స్నానం ,కేదారేశ్వర దర్శనం ,స్పర్శనం పరమ పుణ్య ప్రదం .ఇక్కడ పితృ కర్మ చేస్తే 101తరాల వారు తరిస్తారు .చైత్ర బహుళ చతుర్ధి నాడు ఉప వాసం ఉండి మూడు పూటలా మూడు పుక్కిల్ల కేదార్ జలాన్ని సేవించిన వారు శివైక్యం చెందు తారు .కేదారేశ్వరునికి ఉత్తరం లో చిత్రాన్గాదేశ్వరుడు ,దక్షిణం లో నీల కంఠుడు ,వాయువ్యం లో అమ్బరీకేశ్వరుడు ,అక్కడే ఇంద్రద్యుమ్నేశ్వరుడు ,దీనికి దక్షిణం లో కాలన్జేశ్వరుడు ,చిత్రాన్గాదేశ్వరుని ఉత్తరాన క్షేమేశ్వరుడు,కేదారేశ్వరుని పరి వారం గా ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తారు

 ‘’కేదారేశ్వర లింగస్య –శ్రుత్వోత్పత్తిం చ యో నరః –శివలోక మావా ప్నోతి –విశ్వాపో జాయతే క్షణాత్ ‘’

Related Posts