'నాచురల్ స్టార్' నాని ప్రస్తుతం 'జెర్సీ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. గతంలోనే ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయాలనుకున్నారు .. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. బన్నీతో చేయవలసిన ప్రాజెక్టు వాయిదా పడటంతో, అంతకు ముందు నానితో అనుకున్న సినిమా చేయడానికి విక్రమ్ కుమార్ రెడీ అవుతున్నాడు. అశ్వనీదత్ బ్యానర్లో ఈ సినిమా ఉండొచ్చుననే టాక్ వినిపిస్తోంది.