YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నవంబర్ 8న ఐఏబీ సమావేశం..

నవంబర్ 8న ఐఏబీ సమావేశం..

నెల్లూరు ఆర్ అండ్ బీ అతిథిగృహంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  తరువాత అయన వివరాలు  మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 42 టీఎంసీలు, కండలేరులో 12.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జిల్లాలో గత ఏడాది 63, ఈ ఏడాది 59 శాతం లోటు వర్షపాతం ఉంది. తెలుగు గంగ చరిత్రలో ఎన్నడూలేని విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 48 టీఎంసీల నీటిని జిల్లాకు తెచ్చుకున్నాంమని మంత్రి అన్నారు. గత ఏడాది రెండు విడతలుగా 22 టీఎంసీల కృష్ణాజలాలను తెచ్చుకున్నాం..పెన్నా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవడంతో 7 లక్షల ఎకరాల్లో పంట పండించుకున్నాం. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షంలోనూ 50 శాతం లోటు ఉండే అవకాశం ఉందని అన్నారు. దేవుడి దయతో వర్షాలు బాగా కురిస్తే పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు అవకాశం ఉంది. గతానుభవాలను పరిశీలిస్తే నవంబర్ లోనూ భారీ వర్షాలు కురిసి పంటలు బాగా పండించుకున్న సందర్భాలున్నాయని అన్నారు. ఈనెల ఎనిమిదన జరిగే ఐఏబీ సమావేశంలో నీటి కేటాయింపులకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాం. రాయలసీమ, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

Related Posts