YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఓటుకు నోటు కేసు పై ఫిబ్రవరిలో విచారణకు సుప్రీం కోర్టు ఆదేశం

ఓటుకు నోటు కేసు పై ఫిబ్రవరిలో విచారణకు సుప్రీం కోర్టు ఆదేశం

రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపివేసిన ఓటుకు నోటు కేసు పై ఫిబ్రవరిలో విచారణకు సుప్రీం కోర్టు ఆదేశించింది.  కేసును త్వరితగతిన విచారణ చేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు  విచారించింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబు లంచాలు ఇచ్చారని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే రాజకీయ శతృత్వం తోనే  పిటిషన్ వేశారని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ కోర్టుకు విన్నవించారు. సిబిఐతో కేసు దర్యాప్తు చేయాలని పిటిషన్ దాఖలయింది.

Related Posts