చంద్రబాబు, రాహుల్ కలయికని రాష్ట్రం అంతా విడ్డురంగా చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నాయకుడు అంటే జగన్ అంటున్నారు, తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే నాయకుడు జగన్ అంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ పొత్తులు, పదవుల కోసమే ఆరాటం. ఇంత దిగజారి రాజకీయాలు చేయాలాఅని వైకాపా అధికార ప్రతినిధి పార్థసారధి ప్రశ్నించారు. శుక్రవారం నాడు అయన మీడయాతో మాట్లాడారు. చంద్రబాబు లక్ష్యం కుర్చీ, అధికారమే ధ్యేయం. చంద్రబాబు కి విలువలు, సిద్ధాంతాలు లేవు. చంద్రబాబు వేసే పిచ్చి వేషాలు ఓ వర్గం మీడియా మోయడం దారుణమని అన్నారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించి అధికారం లాక్కున్న నువ్వా ప్రజాస్వామ్యం గురుంచి మాట్లాడేది. మా ఎమ్మెల్యేలని కొన్న నువ్వా ప్రజాస్వామ్యం గురుంచి మాట్లాడేది. ఏ సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీ అధినేతని కలిశావో చెప్పలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగున్నారేళ్లుగా ఒక్క మేలు చేసిందా రాష్ట్రానికి. చంద్రబాబు కి సిద్ధాంతాలు లేవు. కేంద్రం చేసిన ప్రతి అంశంలోనూ మీరు భాగస్వామి కాదా . రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ అన్యాయం చేశాయని అన్నారు. కాంగ్రెస్ లో వైస్సార్ అభిమానులు, టీడీపీలో ఎన్టీఆర్ అభిమానులు వెంటనే బయటికి రావాలి. డెమోక్రసీ పేరు ఎత్తే అర్హత చంద్రబాబు కి లేదని అన్నారు.