దీపావళీ పండగ షాపింగ్ ముందు తూనికలు, కొలతన శాఖ కొరడా ఝళిపించింది. కూకట్ పల్లి, కేపీహెచ్ బీ లోని పలు దుకాణాల సముదాయలపై దాడులు నిర్వహించారు. జీఆర్టీ, సౌతిండియా, చెన్నై షాపింగ్ మాల్, రాజా రాణి, శ్రికుమార్ గోల్డ్ షాప్, చందన బ్రదర్స్, శేరిలింగంపల్లి ప్రాంతంలోని పలు బంగారం దుకాణాలపై సోదాలు నిర్వహించారు. పదిహేను టీమ్ లు గా ఏర్పడ్డ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీపావళి పండుగ సందర్బంగా బంగారం కొనుగోలు అధికంగా ఉంటుంది. వినియోగదారుల ను మోసం చేయకుండా నివారించేందుకు తనిఖీలు చేపట్టామని అధికారులు తెలిపారు. మొత్తం నాలుగు కేసులు నమోదు చేసారు. దీపావళి సందర్భంగా ఎంతోమంది ఆఫర్లు ఉన్నాయని సంతోషం లో గోల్డ్ కొనుక్కోడానికి వచ్చిన ప్రజలకు మోసం జరగకూడదని దాడులు చేసినట్టు,తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గోల్డ్ షాప్ పై తూనికల కొలతల అధికారులు దాడులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.