YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొనసాగుతున్న ఇంటరాగేషన్

కొనసాగుతున్న ఇంటరాగేషన్

ఆంధ్రప్రదేశ్ విపక్షనేత జగన్ పై కత్తి దాడి రాజకీయ శ్రేణుల్లో అలజడి రేకెత్తించింది. అక్టోబర్ 25న జరిగిన దాడి సృష్టించిన వివాదం అంతాఇంతాకాదు. విపక్షం-అధికార పక్షం విమర్శనాశ్త్రాలు గుప్పించుకుంటున్నాయి. వైసీపీ నేతలైతే.. జగన్ పై దాడి ఓ కుట్ర అని.. తమ అధినేతను అంతమొందించేందుకు కొందరు యత్నిస్తున్నారని అంటున్నారు. కుట్ర కోణం బయటకు రాకుండా ఉండేందుకే నిందితుడు శ్రీనివాసరావుతోనూ టీడీపీ డ్రామా ఆడిస్తోందని ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరావు తనకు ప్రాణహాని ఉందని చెప్పడం.. దాడి వెనుక కుట్రకు నిదర్శనమని అంటున్నారు. ఇదిలాఉంటే శ్రీనివాసరావు.. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడు జగన్ వీరాభిమానిగా ఫోకస్ అయ్యారు. శ్రీనివాసరావే కాక అతడి కుటుంబసభ్యులూ ఇదే విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ఇన్వెస్టిగేషన్ లో నిర్ఘంతపోతే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నిందితుడు శ్రీనివాసరావు ఏడాది వ్యవధిలో 9సెల్ ఫోన్లు వాడాడు. దాడి సమయంలో అతడి వద్ద ఉన్న ఫోన్ కూడా రెండు రోజుల క్రితమే కొన్నాడు. శ్రీనివాసరావు ఎక్కువ కాల్స్ చేసిన వారందరినీ సిట్ అధికారులు విచారిస్తున్నారు. వీరిలో యువతులు కూడా ఉన్నారు. శ్రీనివాసరావు కాల్‌డేటా ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తోంది. జగన్‌పై దాడికి ముందు గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన  నలుగురితో  శ్రీనివాసరావు ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇందులో ఓ వివాహిత కూడ ఉన్నట్టు తేలింది. శ్రీనివాసరావు కాల్‌ డేటాలో పిడుగురాళ్లకు చెందిన నాగూర్‌వలి పేరుతో ఉన్న సెల్‌ నంబరుకు అత్యధిక ఫోన్‌కాల్స్‌ ఉన్నాయి. దీంతో అధికారులు అతడిని ప్రశ్నించారు.ప్రత్యేక బృందం మధ్యప్రదేశ్ కూడా వెళ్లింది. ఇక నిందితుడి బ్యాంక్ అకౌంట్లలోని లావాదేవీలపైనా దర్యాప్తు బృందం దృష్టిపెట్టింది. 

Related Posts