మలివిడత ప్రజా పోరాట యాత్రకు బయలుదేరిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం విజయవాడ నుండి తుని వరకు జన్మ భూమి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించారు. అంతకుముందు అయన విజయవాడ రైల్వే స్టేషన్లో కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. అయన తమ మస్యలతో కూడిన వినతపత్రాన్ని కూలీలు పవర్ కు అందించారు. పవన్ కల్యాణ్ తో పాటు జన సేన నేతలు నాదెండ్ల మనోహర్, గంగాధర్, చంద్రశేఖర్ రైలులో ప్రయాణించారు.