వైకాపా అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ రావు ను సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. విచారణ కోసం మరో మూడు రోజులు కస్టడీని పోలీసులు కోరారు. కానీ కోర్టు నిరాకరించింది. తక్షణమే నిందితుడిని జైలుకు తరలించాలని ఆదేశించింది. నిందితుడికి ఈ నెల 9 వరకూ రిమాండ్ విధించింది.