YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇద్దరు మావోయిస్థు కోరియర్లను అరెస్టు

ఇద్దరు మావోయిస్థు కోరియర్లను అరెస్టు

నిషేధిత మావోయిస్టు పార్టీకి కోరియర్లుగా పనిచేస్తున్న ఇద్దరు కోరియర్లను శుక్రవారం జఫర్గడ్ పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టు చేసిన కోరియర్ల నుండి విప్లవ సాహిత్యం, కరపత్రాలు, ఒక కంప్యూటర్, ప్రింటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  కడారి యాదగిరి ఆలియాస్ మహేష్,. శ్రీమంతుల శరత్ ల  అరెస్టుకు సంబంధించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ అదనపు డి.సి.పి (ఆపరేషన్) బిల్లా అశోక్కుమార్ వివరాలను వెల్లడించారు. కడారి యాదగిరి ఆలియాస్ మహేష్    తమ్ముడు కడారి ఐలయ్య గతంలో అప్పటి పీపూల్స్ వార్ దళ సభ్యుడుగా పనిచేసి 1994 సంత్సరంలో పోలీసుల ఎన్కౌంటర్ లో  మృతిచెందాడు. దాంతో  మహేష్ తరాలపెల్లికి చెందిన బక్కన్న ఆలియాస్ కత్తుల రవితో పరిచయంతో నమిలిగోండ ప్రాంతానికి చెందిన యాదన్న దళంలో ఒక యేడాది పని చేసి 1998 పోలీసుల ఎదుట లోంగిపోయాడు.  అనంతరం కడారి యాదగిరి వివాహం చేసుకోని వ్యవసాయం ద్వారా జీవనం కోనసాగించాడు. గత సంవత్సర 2017 డిసెంబర్ మాసంలో మావోయిస్టు పార్టీ ఆజ్ఞాత మావోయిస్టు ఈరెల్లి నాగరాజు ద్వారా కోరియర్ కడారి యాదగిరి  ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని రాంపూర్ ఆటవీ ప్రాంతంలో కె.కె.డబ్ల్యూ కార్యదర్శి దామోదర్ను కలుసుకోగా, మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్ చేసుకోనేందుకుగాను గ్రామాల్లో యువతి,యువకులను ప్రోత్సహించాలని, పార్టీలో చేరిన ప్రతి వ్యక్తికి 20వేల రూపాయలను అందజేయబడుతుందని కే.కే.డబ్ల్యూ కార్యదర్శి కోరియర్ దామెదర్ను యాదగిరిని అదేశించాడు.     దీనితో యాదగిరి తన గ్రామంలో సెల్ఫోన్ రిపేరింగ్తో పాటు, ఫోటో స్టూడియో నిర్వహించుకోనే శ్రీమంతుల శరత్ను పార్టీలోకి వేళ్ళేందుకు యాదగిరి ప్రోత్సహించడంతో ఇందుకు అంగీకరించిన శరత్ను యాదగిరి మరో మారు కే.కే.డబ్ల్యూ కార్యదర్శి దామోదర్ను కలిపించడంతో, గ్రామాల్లో మావోయిస్టు పార్టీ తరుపున ప్రచారం చేయాల్సి వుంటుందని ఇందుకోసం కరపత్రాలను ముద్రించి కోరియర్ యాదగిరికి అందజేయాల్సిందిగా దామోదర్ శరత్కు అదేశించడంతో పాటు, 3వేల రూపాయల అందజేయగా, శరత్ ముద్రించిన కరపత్రాలను గ్రామాల్లో పంపిణీ చేసినందుకుగాను కోరియర్ యాదగిరికి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందని దామోదర్ హమీ ఇవ్వడంతో, సదరు  శరత్ మావోయిస్టు పార్టీకి చెందిన కరపత్రాలను ముద్రించి కోరియర్ యాదగిరి అందజేసినట్లుగా పోలీసులు అందిన పక్కా సమాచారంతో  జఫర్ఘడ్ సబ్-ఇన్స్స్పెక్టర్ ఎ. వెంకటకృష్ణ తన సిబ్బంది ఈ రోజు ఉదయం కోరియర్ యాదగిరి ఇంటిలో తనీఖీలు నిర్వహించడంతో నిందితుడి ఇంటిలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కరపత్రాలను గుర్తించిన పోలీసులు యాదగిరిని పోలీసులు విచారించడం యాదగిరి ఇచ్చిన సమాచారం మేరకు మావోయిస్టు పార్టీ కోరియర్ శరత్ను పోలీసులు అదుపులోకి తీసుకోని కరపత్రాల ముద్రణకు వినియోగించిన కంప్యూటర్ సామగ్రితో పాటు ప్రింటర్ను  స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Related Posts