హైదరాబాద్‌నగరం వైరల్ ఫీవర్‌తో వణికిపోతోంది. వాతావరణం లో అకస్మాత్తుగా చోటుచేసుకున్న మార్పులతో వ్యాధులు ప్రబలుతున్నా యి. అన్ని ఆస్పత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. ఇన్‌పేషెంట్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నగరంలోని ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో ఎన్నడూ లేనంతగా ఈ 15రోజుల కాలంలో రోగుల సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాంధీలో రిజిస్ట్రేషన్ కోసం బారులు తీరుతున్న పరిస్థితి. ఉదయం ఎని మిది గంటలకే లైన్‌లో నిలబడినా ఓపీ చీటీ దొరకని పరిస్థితి ఉందని రోగులు చెబుతున్నారు. ఆస్పత్రిలో అత్యవసర విభాగం దగ్గర వీల్ చైర్లు, స్ట్రెచర్లు కరు వయ్యాయి. దీంతో రోగిని కుటుంబీకులే భుజాలపై వేసుకుని తీసుకెళ్తున్నారు. నగరంలోని ఉస్మానియా అస్సత్రికి రోగుల తాకిడి రోజురోజుకూ పెరిగిపోతోంది. మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రోగుల సంఖ్య పెరిగింది. ఆస్పత్రిలో ఒక్క రోజులో ఓపీ సేవలు 2000కు పైగా నమోదు కావడం ఇదే మొదటి సారని వైద్యులు చెబుతున్నారు. ఈ ఆస్పత్రికి శుక్రవారం 2,645 మంది రోగులు ఓపీ సేవలు పొందారు. తీవ్ర చలి జ్వరం, ప్లేట్‌లేట్స్ పడిపోవడం వంటి జబ్బులతో 150మంది వరకూ ఇన్ పేషెంట్లుగా చేరారు. సాధారణ వ్యాధులతో పాటు ఉస్మానియాకు వచ్చే రోగుల్లో స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ కేసులూ పెరుగుతు న్నాయి. ఈ 15రోజుల కాలంలో 24 డెంగ్యూ అను మానిత కేసులు నమోదు కాగా, 30కి పైగా స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరందరి కీ రక్త పరీక్షలు చేస్తూ అత్యవసరమైతే అడ్మిట్ చేస్తు న్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఐదుగురు స్వైఫ్లూ చికిత్స పొందుతున్నారు. మరో నలుగురు డెంగ్యూ అనుమా నిత రోగులు అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు. దీంతోపాటు స్వైన్‌ఫ్లూ, డెంగ్యూతో బాధపడుతున్న వారు ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ అనేక మంది చికిత్స పొందుతున్నారు.రాష్ట్రంలోనే అతి పెద్ద ఆస్పత్రి అయిన గాంధీలో ఇన్, అవుట్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగు తోంది. ప్రతిరోజూ అవుట్‌పేషెంట్లుగా 3000 మంది, ఇన్ పేషంట్లుగా 2000మంది వరకు వస్తు న్నారు.నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రి కూడా రోగులతో కిక్కిరిసి పోతోంది. చలి జ్వరం, దగ్గు, జలుబు, ప్లేట్ లేట్స్ పడిపోవడం వంటి వ్యాధులతో ప్రజలు ప్రతి రోజూ వందల సంఖ్యలో ఆస్పత్రికి వస్తున్నారు. ఈ ఆస్పత్రికి వారం రోజుల నుంచి వచ్చే రోగుల సంఖ్య ను పరిశీలిస్తే 22న 1803, 23న 1572, 24న 1591, 25న 1480, 26న 1742, 27న 1427, 28న 380, 29న 1830 మంది రోగులు ఔట్ పేషెంట్లుగా ఉన్నారు. ఇంత సంఖ్య ఎప్పుడూ లేదని వైద్యులు చెబుతున్నారు.