నిధుల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై 15వ ఆర్థిక సంఘం ప్రశంసల జల్లు కురిపించింది. శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల తీరును కొనియాడింది. తెలంగాణలోని బీడు భూములకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా చేపడుతున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం సభ్యులు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి అరవింద్ మెహతా మాట్లాడుతూ.. కాళేశ్వరం పనుల వేగం దేశ చరిత్రలోనే ఒక నమూనా అని కొనియాడారు. మిషన్ భగీరథ పథకం ఇతర రాష్ట్రాలకు మోడల్ అని ఆయన అన్నారు.