పెడన మండలం లోని నందిగామ గ్రామం లో ఉన్నటువంటి సెంట్రల్ రక్షిత నీటి పథకం 11 ఎకరాల లో విస్తరించి చుట్టూ ఉన్న పది గ్రామాలకు మంచినీరు సరఫరా చేస్తోంది. ఇక్కడ త్రి ఫేస్ కరెంటు ఉన్నను ఏడు గంటలు మాత్రమే ఇవ్వటం వలన ఈ గ్రామాలకు ప్రతిరోజు నీటి సరఫరా ఇవ్వలేకపోతున్నారు.ఇచ్చిన నీరు కూడా రకరకాల టైమింగ్స్ లో ఇవ్వటం వలన గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ పెడన నుండి కరెంటు సరఫరా వస్తోంది. త్రి ఫేస్ కరెంటు ను ఈ రక్షిత నీటి పథకాలు 24 గంటలు ఇచ్చినట్లయితే 10 గ్రామాలలో మంచినీరు టైం ప్రకారం రెగ్యులర్ గా ఇవ్వడానికి అవకాశం ఉంది.
ఈ విషయమును పరిశీలించి గ్రామస్తులకు మంచినీరు క్రమంగా వచ్చే ఏర్పాటు చేయాలి..