YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మలుపులు తిరుగుతున్న జగన్ హత్యాయత్నం కేసు

మలుపులు తిరుగుతున్న జగన్ హత్యాయత్నం కేసు
 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అతడిని ఆరు రోజుల పాటు ప్రత్యేక ధర్యాప్తు బృందం విచారించింది. ఇప్పటి వరకు 52 మందిని సిట్ విచారించింది. శ్రీనివాసరావు ఫోన్ కాల్స్ ఆధారంగా విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, గుంటూరు, హైదరాబాద్, ఒడిశా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా విచారణ జరిపారు. నిందితుడు ఎక్కువ గా మాట్లాడిన 321 మందిని గుర్తించి వారి నుంచి స్టేట్ మెంట్స్ రికార్డు చేశారు. ఇక లై డిటెక్టర్ పరీక్ష కోసం నిందితుడి అభిప్రాయాన్ని రికార్డు చేయనున్నారు. ఒకవేళ నిందితుడు ఇందుకు అంగీకరిస్తే లై డిటెక్టర్ పరీక్ష కోసం సిట్ కోర్టులో పిటీషన్ వేయనుంది. అయితే, సంఘటన జరిగిన రోజు జగన్ ధరించిన షర్టు ఇప్పించాలని కోరుతూ వేసిన పిటీషన్ తో పాటు ఫ్లెక్సీ, 11 పేజీల లేఖ పరీక్షించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటీషన్లు  విచారణకు వచ్చే అవకాశం.మరో వైపు తిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు తనకు ప్రాణహాని ఉందని చెప్పిన నేపథ్యంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ పోలీసుల వివరణ కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేవ్ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లో తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అటు ఇప్పటికే శ్రీనివాసరావు తల్లిదండ్రులను విశాఖపట్నం పిలిపించిన పోలీసులు శ్రీనివాసరావు మానసిక పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ఇక శ్రీనివాసరావు స్నేహితులైన ఇద్దరు యువతులను కూడా ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఘటన గురించి నిందితుడు ముందే వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక నిందితుడి కాల్ లిస్ట్ ప్రకారం విచారణ చేస్తున్న పోలీసులు ఇప్పటికే 40 మందిని విచారించగా అందులో 30 మంది మహిళలే ఉండటం గమనార్హం.

Related Posts