ఇటీవల విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడిచేసిన కేసులో నిందితుడుకి తెదేపా సభ్యత్వం ఉందంటూ వైకాపా నేత జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలఫై గుంటూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిందితుడు శ్రీనివాస్ తెదేపా కార్యకర్త అంటూ ఇటీవల జోగి రమేశ్ మీడియా సమావేశంలో వెల్లడించారని, మార్ఫింగ్ చేసిన చిత్రాలను చూపారని ఆరోపిస్తూ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జోగి రమేశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.