వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే సిరీస్ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్ మరో సమరానికి సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా.. కరీబియన్ జట్టును ఢీకొంటుంది. అయితే టీ20లకు చిరునామా అయిన ధోని లేకుండానే భారత్ బరిలో దిగుతోంది. అంతేకాదు కెప్టెన్ కోహ్లికి కూడా విశ్రాంతినివ్వడంతో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు లేకుండానే టీమ్ఇండియా.. విండీస్‌తో పోరుకు సై అంటోంది. కుర్రాళ్లతో నిండిన భారత జట్టును రోహిత్‌శర్మ నడిపించనున్నాడు.