టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ దిగ్గజం బ్రయన్ లారా ప్రశంసల జల్లు కురిపించారు. ఈ తరం క్రికెట్‌కు ఓ నాయకుడు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ‘కోహ్లీ ఈ రోజు సాధిస్తున్నవి అసాధారణ ఘనతలు. అతడి పరుగుల వేగం, ఫిట్‌నెస్, వేర్వేరు అంశాలకు ఇస్తున్న ప్రాముఖ్యం అద్భుతం. ప్రస్తుతం క్రికెట్‌కు ఓ యోధుడు దొరికినందుకు సంతోషం’ అని లారా అన్నాడు. విరాట్ కోహ్లీ, సచిన్ తెందుల్కర్‌లో ఎవరు ఉత్తమం అన్న చర్చ అసంబద్ధమని లారా వెల్లడించాడు. వేర్వేరు తరాల్లో ఆడుతున్న క్రికెటర్లకు పోలిక పెట్టొదన్నాడు. వివ్ రిచర్డ్స్, గ్యారీఫీల్డ్ సోబర్స్, తెందుల్కర్, రికీ పాంటింగ్‌లో ఎవరు గొప్పంటే ఏం చెప్తారని ప్రశ్నించాడు. దిగ్గజాల ఆటను స్ఫూర్తిగా తీసుకొని తామంతా ముందుకు వెళ్లామన్నాడు.