మూడు ఓవర్లకే ఓపెనర్లు ఔట్.. మరో మూడు ఓవర్లకే మరో రెండు వికెట్లు..అప్పటికి స్కోరు 45/4.. వెస్టిండీస్ నిర్దేశించిన 110పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ పరిస్థితి ఇది. వెస్టిండీస్ కనీసం 150 పరుగులైనా చేసుంటే పరిస్థితి ఎలా ఉండేదో.. అవును మరి. రెండు జట్లు చేసింది 219 పరుగులే అయినా మొత్తం 13 వికెట్లు నేలకూలాయి. పూర్తిగా బౌలర్లు రాజ్యమేలిన తొలి టీ20లో భారత్ చివరకు 5 వికెట్ల తేడాతో నెగ్గింది. దినేశ్ కార్తీక్ (34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 నాటౌట్), క్రునాల్ పాండ్యా (9 బంతుల్లో 3 ఫోర్లతో 21 నాటౌట్), మనీష్ పాండే (24 బంతుల్లో 2 ఫోర్లతో 19) కీలకంగా నిలిచారు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. కుల్దీప్ మూడు వికెట్లు తీశాడు