మచిలీపట్నం: కోడూరు మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీకి చెందిన ఊటగుం డం గ్రామం సముద్రతీరానికి ఆనుకొని ఉంటుం ది. ఈ గ్రామంలో మొత్తం 200 కుటుంబాలకు చెందిన 700మంది జనాభా నివాసముంటున్నా రు. ఇక్కడ గ్రామస్తులు నిత్యం తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. వీరందరికి నాగాయలంక మండలం కమ్మనమోల పంపుహౌస్ నుంచి తాగునీటిని పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తారు. అయితే ఈ గ్రామం చిట్టచివరన ఉండడంతో కుళాయిల వెంట తాగునీరులో చెత్తచెదారాలతో కూడిన మురుగు నీరు వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఇంటి అవసరాలకు ఉపయోగించుకునే నీరు పూర్తిగా పసర్లు కమ్మి ఉంటాయని వాపోయారు. గ్రామంలోని కుళాయిల వద్ద కూడా మురుగు పెరుకుపోయి పారిశుద్ధ్యం లోపించిం దని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రసుత్తం మరికొంతమంది గ్రామస్తులు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు ఇక్కడవారు చెబుతున్నారు. కొంతమంది అయితే ఈ వ్యాధి తమకు కూడా సోకుతుందనే భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు.తాగునీరు కలుషితమవ్వడం వల్ల తమ వారికి కిడ్నీ వ్యాధి సోకిందని ఊటగుండం గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. ఈ నీరు తాగడం వల్లే మూడు నెలల వ్యవధిలో గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందారని వాపోతున్నారు. రెండు రోజుల క్రితం కురాకుల వెంకటేశ్వరరావు(52) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గ్రామస్తులు చెప్పారు. అదే గ్రామానికి చెందిన దేవనబోయిన శ్రీనివాసరావు (47), ఆరేపు ఆంజ నేయులు (55), దేవనబోయిన వెంకటేశ్వరమ్మ(42), కూచిబోయిన వెంకాయమ్మ (62), కురాకుల కోటేశ్వరరావు (50) కూడా కిడ్నీ సమస్యతో నే మృతిచెందినట్లు వివరిస్తున్నారు. వీరందరు విజయవాడలోని పలు ప్రైవేటు ఆసుపత్రిల్లో చికి త్స పొందగా, వీరికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు వైద్యులు రిపోర్టులు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.మూడు నెలల వ్యవధిలో ఆరుగురు గ్రామస్తులు కిడ్నీ సమస్యతో చనిపోయినా తమ గ్రామానికి సమస్య తెలుసుకునేందుకు వచ్చిన అధికారి గాని, ప్రజాప్రతినిధి గాని లేరని ఇక్కడ వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ఊటగుండం వాసులు కోరుతున్నారు.