కృష్ణాజిల్లా, పెడన మండలం, నందమూరు పంచాయితీ క్రింద 6 హామ్లెట్స్ ఉన్నాయి
(కోట వాని పాలెం, జయంతిపురం , చిన్న నందమూరు, పెద నందమూరు ఎస్సీ కాలనీ)
కోట వాని పాలెం హామ్లెట్ శివారు లో పంట కాలువ ఉంది. ఈ కాలవలో కనీసం ఐదారు నెలలు మోకాలు లోతు నీరు ఉంటుంది.ఈ కాలువ దాటిన తర్వాత పాఠశాల ఉండటం వలన చిన్నారులు మోకాటి నీటిలో నడిచి స్కూల్ కి వెళ్లాల్సి వస్తోంది. వర్షాకాలం వస్తే ఒకటిన్నర కిలోమీటర్లు చుట్టుతిరిగి వెళ్ళ వలసి వస్తోంది.
గ్రామస్తుల కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి సిబ్బందిని పంపించి మూడు నాలుగు తూములు వేసినట్లయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో అని యోచన చేయవలసినదిగా గ్రామస్తులు కోరుతున్నారు. కావున అధికారులు సిబ్బందిని పంపించి ఒకసారి పరిశీలించి గ్రామస్థులకు తగు సహాయం చేయగలరు.