YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ధన త్రయోదశి నాడు ఇలా చేయండి..!!

లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ధన త్రయోదశి నాడు ఇలా చేయండి..!!

ధన త్రయోదశి
ధన త్రయోదశినే ” ధన్ తేరస్” అని అంటూంటారు. మార్వాడీలు (కుదువ వ్యాపారస్తులు) కొత్త పద్దు పుస్తకాలకు లక్ష్మీపూజ చేస్తారు . మహాభారతంలో దీని ప్రస్తావన ఉంది. రాజ్యబ్రహ్ష్టుదైన ధర్మరాజు తాము పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మరలా సంపాదించుకునే ఉపాయం చెప్పమని శ్రీ కృష్ణుణ్ణి కోరుతాడు. సమాధానంగా శ్రీ కృష్ణుడు వామనావతారం గురించి వివరించి ” బలిచక్రవర్తి ఆడినమాట తప్పక, తనను అంతమొందించడానికి వడుగు రూపంలో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని తెలిసికూడా దాన మిచ్చినందుకు వామనుడు బలిచక్రవర్తికి వరం ఇస్తాడు ” – అని చెప్పి , బలి – ” దేవా! ఈ భువిపైన ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి అమావాస్య వరకు నా రాజ్యం ఉండేలాగ ఈ మూడు రోజులూ ప్రజలందరూ ” దీపదానాలు”, “దీపారాధనలు” చేసుకొనేలగ, తన్మూలంగా లక్ష్మీ అనుగ్రహం పొందేలాగా అనుగ్రహించు” మని కోరగా, వామనుడు” తధాస్తు” అని దీవిస్తాడు.

అప్పటినుంచీ ఈ మూడు రోజులూ లక్ష్మీ పూజలు జరుపుకోవడం ఆచరమైంది” అందుచే యుధిష్ఠిరుణ్ణి కూడా అలా చేయమంటాడు గోపాలుడు.

సకల సిరులకు, అష్త్టెశ్వర్యాలకు, నవ నిధులకు, సుఖసంతోషాలకు అధినాయకురాలైన ధనలక్ష్మిని ధన త్రయోదశినాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ విశిష్టమైన పర్వదినంనాడు మనం ఏ భావనతో ఉంటామో, అదే భావం సంవత్సరమంతా కొనసాగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కారమైన రోజు కాబట్టి ఈ ధన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీంతో ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మీ కృపాకటాక్షాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ని ధన త్రయోదశినాడు వ్రతాచరణ పూర్వకంగా ఆరాధిస్తారు. కుబేరుణ్ని కుబేర యంత్రసహితంగా పూజించడంవల్ల అక్షయ సంపదలు అందుతాయని భావిస్తారు. ధన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలతోపాటు రాగి, పంచలోహ పాత్రలు కొనుగోలు చేస్తారు. రాబోయే సంవత్సరానికి ఇది సమృద్ధిదాయకమని నమ్ముతారు. అలాగే ఈ పర్వదినంనాడు ఇతరులకు రుణాల్ని ఇవ్వకపోవడం, వృథా ఖర్చులు చేయకపోవడం వంటివి సంప్రదాయాలుగా పాటిస్తారు.

*పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?*

పరిపూర్ణ ఆయువుకోసం యమధర్మరాజును ధన త్రయోదశినాడు పూజిస్తారు. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వులనూనె పోసి దీపాల్ని వెలిగిస్తారు. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కాబట్టి, ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమదీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి. విష్ణుమూర్తి అనేక అవతారాల్లో ధన్వంతరీ స్వరూపం కూడా ఒకటి. ధన త్రయోదశినాడే ధన్వంతరి క్షీరసాగర మథన సందర్భంలో అమృతకలశంతో ఉద్భవించాడంటారు. శ్రీహరి ఆయనకు ‘జలుడు’ అని నామకరణం చేశాడంటారు. ఆరోగ్యంగా జీవించడానికి ఉపయుక్తమైన ఆయుర్వేదానికి ధన్వంతరిని అధిపతిగా నియమించాడని చెబుతారు. సప్త ధాతువుల్లో బంగారానికి వైద్యపరమైన శ్రేష్ఠత అధికంగా ఉందనీ, స్వర్ణభస్మ సేవనంవల్ల మనిషి జీవన కాలాన్ని పెంపొందించుకోవచ్చని ధన్వంతరి వెల్లడించాడు. ధన త్రయోదశికీ, బంగారానికి అవినాభావ సంబంధం ఏర్పడటానికి ఇది కూడా ఓ కారణంగా చెబుతారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, వారణాశిలో, తమిళనాడులోని శ్రీరంగంలో, కేరళలోని అష్ట ధన్వంతరీ ఆలయాల్లో ధన్వంతరిని ధన త్రయోదశి నాడు విశేషంగా ఆరాధిస్తారు.

ఈ ధనత్రయోదశి ధన్వంతరి జన్మదినం కూడా. ఏఎ రోజున విష్నుమూర్తిని పూజించటం మంచి ఆరోగ్యాన్ని కలుగచేస్తుంది.

Related Posts