YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎదుర్కోనే దమ్ము లేక హత్యాయత్నం

 ఎదుర్కోనే దమ్ము లేక హత్యాయత్నం

ఎన్టీఆర్ స్దాపించిన తెలుగుదేశం పార్టీని తెలుగుదొంగల,తెలుగుద్రోహుల పార్టీగా మార్చేశారు. తెలుగుదేశం పార్టీని తెలుగు ధాల్ పప్పు పార్టీగా మార్చేశారు. జగన్ మోహన్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలనే హత్యకు కుట్ర చేశారని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు.    జగన్ ను  ఎదుర్కొనే దమ్ములేక హత్యాయత్నం చేయించారు. జగన్ పై దాడి జరిగి పది రోజులైంది. ఘటనను నీరుగార్చేందుకు బాబు అండ్ కో డ్రామాలు ఆడుతోందని  విమర్శించారు. హత్యాయత్నం కేసులో  ఏ-1 ముద్దాయి చంద్రబాబు. ప్రతిపక్షనేతకు భద్రత కల్పించలేని చంద్రబాబు సిగ్గుపడాలి. కులాలపేరు చెప్పి ఓట్లు అడగకూడదని చంద్రబాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని అన్నారు. తన సొంతపార్టీ ఎంఎల్ ఏను చంపుతుంటే రక్షించుకోలేని చేతకాని వ్యక్తి చంద్రబాబు. శునకానందపార్టీకి జాతీయఅధ్యక్షుడు చంద్రబాబు. ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీని శునకానందపార్టీగా పిలవాలి.  కేంద్రాన్ని  డిమాండ్ చేస్తున్నాం.ఈ రాష్ర్ట ప్రభుత్వ కంట్రోల్ లో లేని స్వతంత్ర సంస్దతో విచారణ జరిపించాలి. కోడికత్తి పార్టీ అని ఎకతాళిగా మాట్లాడే సిగ్గులేని వ్యక్తి అయన .ఎఫ్ ఐఆర్ రాకముందే డిజిపితో ప్రెస్ మీట్ పెట్టించి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నించారని అన్నారు. మీడియాను అది కత్తి కాదు ఫోర్క్ అని చంద్రబాబు దుష్ప్రచారం చేయించారు. చంద్రబాబు గడ్డి తింటున్నారు కనుకే జగన్ గారి ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లారు అని చెప్పారు. నిజంగా రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ రక్షించాలంటే ఆపరేషన్  గరుడపై విచారణ  వేయమని చెబుతారు కాని దాని వెనక చంద్రబాబు,లోకేష్  ఉన్నారు. కాబట్టే విచారణ చేయించడంలేదని అన్నారు. హత్యాయత్నం చేయించకుండా ఉండిఉంటే ఈరోజు ఇన్నిరకాలుగా మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. హర్షవర్దన్ చౌదరిని మీడియా ముందుకు ఎందుకు పోలీసులు తీసుకురాలేకపోతున్నారు. జనవరి నుంచి ఆ కత్తి హోటల్ ఉంటే ఆ దిశగా ఎందుకు విచారణ చేయించలేదు. ఇదంతా ఆపరేషన్ గరుడ లో ప్లాన్ అని డిజిపి,ఇంటిలిజెన్స్ ఛీప్ లను పక్కన కూర్చోపెట్టుకని చెప్పడం దారుణమని అన్నారు.  డిజిపి, ఇంటిలిజెన్స్ ఛీఫ్ లను తీసేసి శివాజి చౌదరిని పెట్టుకోండి. జగన్ మోహన్ రెడ్డిని హత్య చేయించేందుకు హర్షవర్దన్ చౌదరిని,ఫ్యూజన్ రెస్టారెంట్ ను ఎన్నుకున్నారు. గుంటూరుకు వచ్చిన రాహుల్ గాంధిపై చెప్పులు వేయించిన నీవు ఇప్పుడు  ఆ రాహుల్ గాంధి చెప్పులు నీ నెత్తిన పెట్టుకుని ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అబిమానులు చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన సమయం వచ్చింది. రాష్ర్టాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ తో ఎలా జతకలుస్తున్నావు. బట్టలూడదీసి కొడతారన్న అయ్యన్నపాత్రుడు ఈరోజు ఏం సమాధానం చెప్తారని అడిగారు. రాహుల్ పరిస్థితిపై తనకు జాలివేస్తోందన్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఐరన్ లెగ్ అనీ, ఆయనతో పెట్టుకున్నవాళ్లు ఎవ్వరూ బాగుపడలేదని రోజా విమర్శించారు.

Related Posts