శ్రీకాకుళం జిల్లాలో మంత్రి నారా లోకేష్ సోమవారం పర్యటించారు. ముందుగా మందస ప్రభుత్వ హై స్కూల్ గ్రౌండ్ లో తిత్లీ తుఫాను బాధితులకు నష్ట పరిహార చెక్కులను పంపిణి చేసారు. ప్రభుత్వ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన జిమ్ ని ప్రారంభించారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 5,354 ఇళ్లకుగాను 3,767 ఇళ్ళు పూర్తిగాను, 1587 ఇళ్ళు పాక్షికంగాను దెబ్బతిన్నట్లు గుర్తించడం అయినది. దీనికి సంబంధించి రూ.95.75 కోట్లు నష్ట పరిహారం చెక్కులను తుఫాను బాధితులకు అందించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి 12,495 రైతులకు చెందిన 9333.71 ఎకరాలకుగాను రూ. 7.36 కోట్లు నష్ట పరిహారం చెక్కులను లోకేష్ భాదితులకు అందజేసారు. ఉద్యానశాఖకు సంబంధించి 15,190 మంది రైతులకు చెందిన 15,895 ఎకరాలలో కొబ్బరి తోటలు, జీడి తోటలు, మామిడి తోటలు మరియు కూరగాయల తోటలు దెబ్బతిన్నట్లు గుర్తించడం అయినది. దీనికి సంబంధించి రూ. 65.45 కోట్లు నష్ట పరిహారం రైతులకు మంత్రి నారా లోకేష్ అందించారు పశు సంవర్ధక శాఖకు సంబంధించి 1197 ఆవులు, గేదెలు, 1670 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. 6806 పశువుల శాలలు కూలిపోయాయి. దీనికి సంబంధించి రూ.4.33 కోట్లు నష్ట పరిహారం చెక్కులను రైతులకు లోకేష్ ఇచ్చారు 168 కిరాణా షాపులు, 26 మందికి చెందిన బోట్లు దెబ్బతిన్నట్లు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి రూ. 23 లక్షలు నష్ట పరిహారం చెక్కులను మంత్రి లోకేష్ ఇచ్చారు, మంత్రి మాట్లాడుతూ మందస మండలంలో గల 62 వాటర్ స్కీంలకు 62 జనరేటర్లు ఏర్పాటు చేసి త్రాగునీటి సదుపాయం కల్పించడమైనది. 82 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేసారని అన్నారు. మందస మండల పరిధిలో గల 679 బోర్ వెల్స్ ను రెండు రోజుల్లో మరమ్మత్తులు చేసి త్రాగునీటి సౌకర్యం కల్పించారు. తిత్లీ తుఫాన్ వల్ల విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్థంబించింది. 6500 విద్యుత్ స్థంబాలు, 259 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ త్వరితగతిన పనులను పూర్తి చేసి 2 రోజుల్లో మండల కేంద్రానికి, 6 రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్దరించడం జరిగింది. ఇందుకు గాను సుమారు 150మంది విద్యుత్ శాఖా ఉద్యోగులు మరియు 21,882 సిబ్బందిని ప్రత్యేకంగా మందస మండలానికి కేటాయించడం జరిగిందని అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 24,666 కార్డులకు గాను 629.575 మెట్రిక్ టన్నుల బియ్యం, 12.333 మెట్రిక్ టన్నుల పంచదార, 28.435 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 24,691 లీటర్ల వంట నూనె, 24,666 కేజీల బంగాళదుంపలు, 24,666 కేజీల ఉల్లిపాయలను పంపీణీ చేసారని అన్నారు. తిత్లీ తుఫాన్ వల్ల ఇంటి పైకప్పు కూలిపోయిన వారికి 6293 టార్పాలిన్లను పంపీణీ చేయడం జరిగింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 82 వేల 500 ఆహార పొట్లాలు, సుమారు 1 లక్ష 9వేల బిస్కట్ ప్యాకెట్లు (మమ్స్ మ్యాజిక్, టైగర్), 24,900 కేజీల గోధుమ పిండి, 98 వేల 624 న్యుడుల్స్ ప్యాకెట్లు, 9 వేల 600 బ్రిటానియా రస్కులను పంపీణీ చేయడం జరిగిందని అన్నారు. 15 వేల 800 పాల ప్యాకెట్లను పంపీణీ చేయడం జరిగింది. దీనితో పాటు రెవెన్యూశాఖ, గణేష్ చారిటబుల్ ట్రస్ట్, ఊటీఏఏపీ సహకారంతో 1 లక్ష 15 వేల 324 కొవ్వుత్తులను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంపీణీ చేసారని అయన అన్నారు.