సత్తెనపల్లి నియోజకవర్గ స్వయం సహయక సంఘాల (వి.ఓ.ఎ), మెప్మా ఆర్పీల ఆత్మీయ సమావేశంలో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్గోన్నారు. సత్తెనపల్లి కాకతీయ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కింద మహిళలకు స్పీకర్ చీరలు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా కోడెల మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ 10వేలు సంపాదించడమే లక్ష్యంగా మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పిస్తుంది. కుటుంబంలో భర్త, బార్య ఇద్దరు కష్టపడి పనిచేస్తేనే కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో సమస్యలు లేని మనుషులు ఉండరూ.... సమస్యలను తట్టుకోని పోరాడే వాడే జీవితంలో పైకి వస్తారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో సత్తెనపల్లి పట్టణంలో 2వందల కోట్లకు పైగా అభివృద్ధి జరిగిందని అన్నారు. నియోజకవర్గంలో పరిధిలోని యానిమేటర్లు, ఆర్పీలు నియోజకవర్గంలో మహిళల అభివృద్ధికి యనలేని కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డల అభివృద్ధికి ప్రభుత్వం యనలేని కృషి చేస్తుంది. నేడు రాష్ట్రంలో మహిళలు ప్రపంచస్థాయి వేదికలపై ప్రసంగిస్తున్నారంటే దాని గోప్పతనం సీఎం చంద్రబాబుది. నేడు రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను ఆడబిడ్డలు అందిపుచ్చుకోవాలి. డ్వాక్రా, స్వయం సహయక సంఘాలు ద్వారా నేడు రాష్ట్రంలో మహిళలలో సమూల మార్పులు వచ్చాయి. ప్రపంచ దేశాలలో మనకు ఉన్న గోప్పతనం కుటుంబ వ్యవస్థ. భారతదేశం మొత్తంలో ఉన్న డ్వాక్రా గ్రూపులలో సగం విభజనకు ముందు ఉన్న రాష్ట్రంలో ఉన్నాయపకపానే. పదిమంది గ్రూప్ సంఘటిత శక్తిగా ఎదుగుతున్నారు. గతంలో కంటే ఎన్నోరెట్లు మహిళలలో దైర్యం పెరిగింది. గతంలో స్త్రీ విద్య శాతం తక్కువగా ఉండేది... కాని నేడు రాష్ట్రంలో అది గణణీయంగా పెరిగింది. చదువుకోవడం వలన ప్రపంచం మొత్తం మనో నేత్రం ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆకాశమే హద్దుగా మహిళలకు చేయూతనిస్తుంది. రాష్ట్రంలో బ్యాంకర్లు మహిళలకు రుణాలు ఇవ్వడానికి క్యూ లో ఉంటున్నారు. మహిళలు తీసుకున్న రుణాలను రెట్టింపు చేసే విధంగా ప్రణాళికలు రచించుకోవాలి. రాష్ట్రంలో ప్రభుత్వం స్కిల్స్ డెవలఫ్ మెంట్ సెంటర్స్ ద్వారా అనేక రంగాల్లో శిక్షణ ఇస్తుంది. వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.