పతంజలి ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చిన రాందేవ్ బాబా.. ఫ్యాషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. స్వదేశీ సంప్రదాయంతో ‘పతంజలి పరిధాన్’పేరుతో దుస్తుల వ్యాపారం ప్రారంభించారు. సోమవారం ఢిల్లీలో పతంజలి పరిధాన్ మొదటి స్టోర్ను లాంఛ్ చేశారు. దీపావళి, ధనత్రయోదశి సందర్భంగా మార్కెట్లోకి.. పతంజలి జీన్స్ను విడుదల చేశారు. ఈ పరిధాన్ జీన్స్లపై భారీ డిస్కౌంట్లను కూడా ప్రకటించారు రాందేవ్ బాబా. ధనత్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు 25శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. పతంజలి పరిధాన్ కింద మూడు బ్రాండ్స్ను విడుదల చేశారు. ఆస్థా, సంస్కార్, లైవ్ ఫిట్ బ్రాండ్స్ కింద దాదాపు 3500 రకాల వస్త్రాలు, షూస్, యాక్సెసరీస్ను అందుబాటులోకి వచ్చాయి. ఈ స్టోర్లో మహిళలు, పురుషులు, చిన్న పిల్లల దుస్తులు దొరకుతాయి. పండుగ సీజన్ సందర్భంగా ఒక జీన్స్, రెండు టీ షర్టులు (రూ.7000 విలువ చేసేవి) కలిపి కేవలం రూ.1100కే ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.2500 విలువ చేసే రూ.500కే అందిస్తున్నారు