YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

సన్ రైజర్స్ కు ధావన్ గుడ్ బై

సన్ రైజర్స్ కు ధావన్  గుడ్ బై

ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కి సుదీర్ఘకాలంగా ఆడుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఆ జట్టుకి గుడ్బై చెప్పేశాడు. ఈ ఏడాది ఐపీఎల్కి ముందు జరిగిన వేలంలో తనని తక్కువ ధరకే ‘రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం)’ ద్వారా సన్రైజర్స్  హైదరాబాద్ ఫ్రాంఛైజీ దక్కించుకుందని గుర్రుగా ఉన్న ఈ ఓపెనర్.. జట్టు యాజమాన్యంతోనూ గొడవపడినట్లు వార్తలు వచ్చాయి. బెంగళూరు వేదికగా జనవరిలో జరిగిన వేలంలో శిఖర్ ధావన్ని దక్కించుకునేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆఖరి వరకూ పోటీపడినా.. రూ. 5.2 కోట్లకి ఆర్టీఎం ద్వారా హైదరాబాద్ చేజిక్కించుకుంది. కానీ.. తనకి ఇంకా మంచి ధర వచ్చేదని భావించిన ధావన్.. ఫ్రాంఛైజీ వద్ద అసహనం వ్యక్తం చేసి.. 2019 ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్కి ఆడనని తెగేసి చెప్పేశాడట. శిఖర్ ధావన్ అయిష్టతని పరిగణలోకి తీసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తాజాగా ఢిల్లీ డేర్డెవిల్స్కి అతడ్ని బదిలీ చేసి.. ఆ జట్టు నుంచి విజయ్ శంకర్ (రూ. 3.2 కోట్లు), నదీమ్ (3.2 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.55 లక్షలు)లను తీసుకుంది. ఈ ఏడాది వేలం ప్రకారం ఈ ముగ్గురి ధర రూ. 6.95 కోట్లుకాగా.. శిఖర్ ధావన్ ధరని మినహాయించి మిగిలిన సొమ్ముని ఢిల్లీ డేర్డెవిల్స్కి హైదరాబాద్ ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో.. శిఖర్ ధావన్ ధర ఇప్పుడు రూ. 5.2 కోట్ల నుంచి రూ 6.95 కోట్లకి పెరిగినట్లయింది. 

Related Posts