శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాను బాధితులకు అందజేసే చెక్కులపై ఏకంగా సీఎం చంద్రబాబునాయుడి ఫోటోలు ముద్రించటం వివాదస్పదం అవుతోంది. ఇది నిబంధనలకు వ్యతిరేకం అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఇలాంటి చర్యలను ప్రోత్సహించటం సరికాదని చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన దాఖలాలు లేవని చెబుతున్నారు.తిత్లీ తుఫాన్ సమయంలో సీఎం తీరు పలుమార్లు వివాదస్పదం అయింది. బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్న ఫోటోలను కూడా ఏకంగా పత్రికల్లో ప్రకటనలకు..హోర్డింగ్ లకు వాడుకోవటంపై రాజకీయ పార్టీలు విమర్శలు చేశాయి. ఇప్పుడు ఏకంగా చెక్కులపై ఫోటోలు ముద్రించటం మరింత దుమారం రేపటం ఖాయంగా కన్పిస్తోంది.