YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వర్శిటీల్లో 20 వేల యువనేస్తం దరఖాస్తులు

వర్శిటీల్లో 20 వేల యువనేస్తం దరఖాస్తులు

 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి సంబంధించి భారీ సంఖ్యలో దరఖాస్తులు వర్సిటీల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 28వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో వర్సిటీల వద్ద 20వేల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. చదువుకున్న నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. భృతితో పాటు నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం ఈ పథకంలోని ప్రత్యేకత. దేశంలో ఎక్కడా లేనివిధంగా 1.70 లక్షల మందికి నిరుద్యోగ భృతి చెల్లిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ పథకం కింద 9.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1.82 లక్షల మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. అందులో 1.70 లక్షల మందికి భృతి చెల్లిస్తున్నారు. అర్హులైన వారిలో వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య 28,863. వీటిలో రాష్ట్రంలోని వివిధ వర్సిటీల వద్ద భారీ సంఖ్యలో పెండింగ్‌లో ఉండటం గమనార్హం. దరఖాస్తుదారు దాఖలు చేసిన డిగ్రీ, తదితర సర్ట్ఫికెట్లను పరిశీలన కోసం ప్రభుత్వం ఆయా వర్సిటీలకు పంపుతోంది. అధికారిక సమాచారం ప్రకారం భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లోని వర్సిటీల వద్ద 7988, రాష్ట్రంలోని వర్సిటీల వద్ద 12,257 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం వద్ద 3181 పెండింగ్‌లో ఉండగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద 2958, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వద్ద 39, శ్రీ వేంకటేశ్వర వర్సిటీ పరిధిలో 1956, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరిధిలో 3194, జేఎన్‌టీయు (కె) వద్ద 100, రాయలసీమ వర్సిటీలో 411, ఆదికవి నన్నయ వర్సిటీలో 29, జేఎన్‌టీయు (ఎ) పరిధిలో 12, సాంకేతిక విద్య కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ వద్ద 29, గీతం వర్సిటీలో 102, ఇతర వర్సిటీల్లో 641 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక సమాచారం చెబుతోంది. దరఖాస్తుదారుని పేరు, వర్సిటీ రికార్డులతో సరిపోలక పోవడం వంటి కారణాలతో దరఖాసులు పరిష్కారానికి నోచుకోవడం లేదు

Related Posts