రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎఫ్ 1, హెచ్ 2 వో బోట్ రేసింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎఫ్ 1, హెచ్ 2వో ఏర్పాట్లతో పాటు అమరావతి గ్లోబల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ - 2018 నిర్వహణపై బెరంపార్కులో టూరిజయం రాష్ట్ర స్థాయి అదికారులతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహిస్తున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ బోట్ రేసింగ్‌తోపాటు 17, 18 తేదీల్లో అమరావతి గ్లోబల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ - 2018ని నిర్వహించనున్నామన్నారు. నూతన రాజధాని అమరావతి ఖ్యాతి పెంచే విధంగా ఈ కార్యక్రమాలకు ఏర్పాట్లు ఉంటాయన్నారు. పున్నమి ఘాట్ వద్ద 16వ తేదీ మధ్యాహ్నం బోట్ రేసింగ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అదే విధంగా 18వ తేదీ ముగింపు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. అమరావతి గ్లోబల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ - 2018 ఆంధ్రా ఐడియల్ ఎంపికకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఔత్సాహికులైన సంగీత, నృత్య కళాకారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ ఈ నెల 3వ తేదీ నుండి నవంబర్ 11వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించి, వంద మందిని గుర్తించి వీరిలో ముగ్గురిని ఎంపిక చేస్తుందన్నారు. వీరికి ఈ ఫెస్టివల్ కార్యక్రమాల్లో దేశ, విదేశాల నుండి వచ్చే సంగీత, నృత్య బృందాలతో కలిసి పాల్గొనే అవకాశం కల్పిస్తారన్నారు. పోటీలో పాల్గొనే వారు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారై ఉండాలన్నారు. ప్రతిభ ఉండి బాహ్య ప్రపంచానికి తమ ప్రతిభను కనబరిచే విధంగా ఈ ఆంధ్రా ఐడియల్‌లో ప్రదర్శించే అవకాశం ఉందన్నారు. ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటి అండ్ కల్చరల్ కమిషనర్ సీఈవో విజయభాస్కర్ నేతృత్వంలో పరిశీలన జరుగుతుందన్నారు